IND vs SA 2019 : భారత్, సౌతాఫ్రికా టీ20కి వర్షం ముప్పు...

IND vs SA T20 : కరేబియన్ గడ్డపై మూడు సిరీస్‌లు గెలిచి... మాంచి ఊపుమీదున్న టీమిండియా... ఇక సఫారీలపై సవారీ చేయడానికి రెడీ అయ్యింది. టీ-ట్వంటీతో దుమ్మురేపేద్దామనుకుంటే... వర్షం గండం పొంచి ఉంది. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 7:40 AM IST
IND vs SA 2019 : భారత్, సౌతాఫ్రికా టీ20కి వర్షం ముప్పు...
భారత జట్టు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 7:40 AM IST
India vs South Africa T20 : స్టేడియంలనైతే... మనకు కావాల్సిన విధంగా రెడీ చేసుకోగలుగుతున్నాం కానీ... వర్షాన్ని మాత్రం కంట్రోల్ చెయ్యలేకపోతున్నాం. ఫలితంగా... మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే... వర్షం పడుతుంటే... క్రికెట్ జట్లు, అభిమానులూ తీవ్ర నిరాశ చెందుతున్నారు. వరల్డ్ కప్‌లో ఇలాగే జరిగింది. మళ్లీ ఇప్పుడు భారత జట్టుకు తొలి మ్యాచ్ నుంచే వర్షం సవాలు విసురుతోంది. సౌతాఫ్రికా నుంచీ సీనియర్లు లేక... కుర్రాళ్లతో జట్టు నిండిపోవడంతో... టీట్వంటీ సిరీస్ గెలవడం టీమిండియాకు తేలికే. పైగా... ప్రపంచకప్‌లో ఆ జట్టు పెద్దగా పెర్ఫార్మెన్స్ చెయ్యలేకపోయింది. గ్రూప్ దశలోనే వెళ్లిపోయింది. తిరిగి కోలుకునే ఉద్దేశంతో... నేటి మ్యాచ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నా... ఫేవరెట్ మాత్రం కోహ్లీ సేనే.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్... ధర్మశాలలోని HPCA స్టేడియంలో నేటి రాత్రి 7 గంటలకు జరగబోతోంది. వర్షం ఎఫెక్ట్ పడకుండా... పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వెస్టిండీస్ టూర్‌లో అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. టెస్టులు, వన్డేలు, టీ-ట్వంటీల్లో ఇండియా... ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఫలితంగా జట్టులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అదే సమయంలో... సౌతాఫ్రికా మాత్రం... తిరిగి పుంజుకునే లక్ష్యంతో బరిలో దిగుతోంది.

మీకు తెలుసు. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగబోతోందని. అసలే ప్రపంచకప్ మిస్సైన టీమిండియా... టీ20 నైనా కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే... సఫారీ టూర్‌లో కుర్రాళ్లకు అవకాశం కల్పిస్తూ... ప్రయోగాలు చేస్తోంది. నవ్‌దీస్ సైని, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్‌, కృనాల్ పాండ్యాకి ఛాన్స్ ఇచ్చింది. బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు జట్టులో కేఎల్ రాహుల్ ఉండగా, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలర్లు చెలరేగిపోతే... సఫారీ జట్టు మరో పరాజయం మూటకట్టుకోవాల్సిందే.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైని.దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సే వన్ డర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దలా, బోర్న్ ఫార్టిన్, బ్యురన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జె, అండిలె ఫెహ్లుక్వాయో, డ్వేన్ పిట్రోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ షంసి, జర్జ్ లిండె.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...