India vs South Africa: సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా...2-0తో సిరీస్ కైవసం

సౌతాఫ్రికా జట్టుపై టీమిండియా 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌లో భారత్ 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ కైవసం చేసుకుంది.

news18-telugu
Updated: October 13, 2019, 5:11 PM IST
India vs South Africa: సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా...2-0తో సిరీస్ కైవసం
విజయానందంలో టీమిండియా ఆటగాళ్లు (Twitter)
  • Share this:
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా జట్టుపై టీమిండియా 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచుల సిరీస్‌లో భారత్ 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్సులో 275 పరుగులకు ఆలౌట్ అవ్వగా. ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు రెండో ఇన్నింగ్సులో కూడా చతికిలపడ్డారు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలను తొలి ఇషాంత్ శర్మ దారుణంగా దెబ్బతీశాడు. ఓపెనర్‌ మార్‌క్రామ్‌ డకౌట్‌ అవ్వగా. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో సౌతాఫ్రికా 130 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఎల్గర్ (48), బవుమా (38), ఫిలాండర్ (37) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజా, ఉమేశ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా అశ్విన్, ఇషాంత్, షమి చెరో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Published by: Krishna Adithya
First published: October 13, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading