Home /News /sports /

INDIA VS SOUTH AFRICA GOOD NEWS FOR TEAM INDIA PLAYERS BCCI CONFIRMS THAT THERE IS NO BIO BUBBLE SRD

India vs South Africa : టీమిండియా ఆటగాళ్లకు అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి ఫ్రీ బర్డ్స్..

Team India

Team India

India vs South Africa : చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న జరిగే మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12వ తేదీన రెండో టి20, మహారాష్ట్రలోని విదర్భలో 14వ తేదీన మూడో టి20 జరగనున్నాయి. ఇక చివరి రెండు టి20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఇంకా చదవండి ...
  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా (South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ (India vs South Africa)లో పర్యటించనుంది. ఈ క్రమంలో జూన్ 9న ఆరంభమయ్యే ఈ సిరీస్ జూన్ 19వ తేదీతో ముగియనుంది. ఇక, ఈ సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై బయో బబుల్ వ్యవస్థ ఉండబోదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- ప్లేయర్లు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి బయో బబుల్ వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది. 2020 ప్రారంభంలోనే దీన్ని అమలు చేసింది. రెండున్నరేళ్లుగా ప్లేయర్లు ఇందులోనే ఉంటున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు క్వారంటైన్ కాలాన్ని సైతం గడపాల్సి వచ్చింది. దీనివల్ల మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు.

  ఈ బయో బబుల్ బందీఖానా నుంచి ప్లేయర్లకు విముక్తిని కల్పించింది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో ఆరంభం అయ్యే సిరీస్ నుంచి బయో బబుల్ ఉండబోదని తేల్చి చెప్పింది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా- ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. బయో బబుల్ నుంచి బయటికెళ్లినప్పటికీ.. కోవిడ్ పరీక్షలను మాత్రం జరిపించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారాయన. బయో బబుల్‌కు.. ఐపీఎల్ 2022 సీజన్‌ చిట్టచివరిదని తేల్చి చెప్పారు.

  షెడ్యూల్ ఇదే..

  చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న జరిగే మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12వ తేదీన రెండో టి20, మహారాష్ట్రలోని విదర్భలో 14వ తేదీన మూడో టి20 జరగనున్నాయి. ఇక చివరి రెండు టి20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు టి20లు కూడా జూన్ 17, 19వ తేదీల్లో జరుగుతాయి.

  ఇది కూడా చదవండి : ' నా భర్త మీకు అంత లోకువయ్యాడా '.. వాళ్లకి గట్టి బుద్ధి చెప్పిన సంజూ భార్య..

  ఇప్పటికే భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవలే 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టెంబా బావుమా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా టీమ్‌కు ఇది చాలా ముఖ్యమైన పర్యటన కానుంది.

  2021 ఐసీసీ టీ20 ప్రపంచ‌కప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని త్రుటిలో మిస్సయిన తర్వాత దక్షిణాఫ్రికాకు ఇది తొలి టీ20 టోర్నమెంట్ కానుంది. ఇక ఆస్ట్రేలియాలో జరగనున్న రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12దశ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఇండియా ఒకే గ్రూప్‌లో ఆడనున్నాయి.

  సౌతాఫ్రికా జట్టు : బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, నోకియా, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, షమ్సీ, ట్రిస్టస్ స్టబ్స్, రస్సీ వ్యాన్ డెర్ డుస్సెన్, మార్కో యాన్సెన్, వేన్ పార్నెల్.

  టీమిండియా జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వైస్ కేప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రన్ మాలిక్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs South Africa, KL Rahul, Rohit sharma, Sports, Team India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు