INDIA VS SOUTH AFRICA FIRST ODI LIVE CRICKET SCORE UPDATES SOUTH AFRICA WON THE TOSS AND OPT TO BAT FIRST SRD
Ind Vs Sa First ODI : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా..
India vs South Africa
Ind Vs Sa First ODI : అయితే ఈ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కోహ్లీ టీమిండియాకు ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్‌గా లేడు. దీంతో ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ సాధారణ ఆటగాడిగా తొలి సారి ఆడబోతున్నాడు.
మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ముగిసింది. టెస్టుల్లో 2-1 తేడాతో భారత్ సిరీస్ ను కోల్పోయింది. ఇక ఇవాళ్టి నుంచి వన్డే సమరం ప్రారంభం అయింది. బోలాండ్ పార్క్ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో భారత్, సౌతాఫ్రికా (Ind Vs Sa) 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంతో జట్టును రాహుల్ నడిపించనున్నాడు. ఇక, ఈ మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆశ్చర్యకరంగా భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కోహ్లీ టీమిండియాకు ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్‌గా లేడు. దీంతో ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ సాధారణ ఆటగాడిగా తొలి సారి ఆడబోతున్నాడు. 2016 అక్టోబర్ తర్వాత ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఫస్ట్ టైమ్ ఓ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సెంచరీ చేసి 25 నెలలు గడిచాయి. ఇటువంటి పరిస్థితుల్లో, కెప్టెన్సీ ఒత్తిడి నుంచి విముక్తి పొందిన కోహ్లీ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా 12 వన్డేల్లో 46.66 సగటుతో 560 రన్స్ చేశాడు. పైగా 2018 సౌతాఫ్రికా పర్యటనలో కోహ్లీ దుమ్మురేపాడు. మూడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 286 రన్స్ చేశాడు. మళ్లీ అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రానున్నాడు.
Toss News - South Africa have won the toss and elect to bat first in the 1st ODI.
రోహిత్ గైర్హాజరీలోనే జట్టులోకి వచ్చిన ధావన్ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మిడిలార్డర్లో కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బరిలోకి దిగనున్నారు. వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ లతో టీమిండియా బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ కి ఇదే తొలి వన్డే మ్యాచ్.జస్ప్రీత్ బుమ్రా, భువీ కొత్త బంతిని పంచుకోనున్నారు. ఆశ్చర్యకరంగా యుజువేంద్ర చాహల్ మరో స్పిన్నర్ గా బరిలోకి దిగనున్నాడు.
A look at our Playing XI for the 1st game.
Congratulations to Venkatesh Iyer who makes his ODI debut for #TeamIndia. 👏 👏
మరోవైపు సౌతాఫ్రికా టీమ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. డికాక్, జానెమన్ మలన్, బవుమా , మార్క్రమ్, డుస్సెన్, మిల్లర్, వంటి పక్కా బ్యాటర్లు ఉన్నారు. ఆఖర్లో ఫెలుక్వాయో, జాన్సెన్ వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. రబాడాకు సౌతాఫ్రికా విశ్రాంతి కల్పించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.