Home /News /sports /

INDIA VS SOUTH AFRICA FIRST ODI LIVE CRICKET SCORE UPDATES SOUTH AFRICA WON BY 31 RUNS SRD

Ind Vs Sa : ఫస్ట్ వన్డేలో విక్టరీ సౌతాఫ్రికాదే.. నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ..

Ind Vs Sa

Ind Vs Sa

Ind Vs Sa : టెస్ట్ సిరీస్ లో ఓడిన టీమిండియాకు ఫస్ట్ వన్డేలో కూడా పరాభవమే ఎదురైంది. ఛేజింగ్ లో టాపార్డర్ సూపర్ ప్రదర్శన చేసినా.. మిడిలార్డర్ చేతులేత్తేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

    సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా ఓడిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసింది. ధావన్, కోహ్లీ, శార్దూల్ ఠాకూర్ లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. మిగతా బ్యాటర్లు వైఫల్యం చెందడంతో టీమిండియా 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ధావన్ 79 పరుగులు, కోహ్లీ 51 పరుగులు, ఠాకూర్ 50 పరుగులు నాటౌట్ రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, షంసీ, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు తీశారు. మర్కర్రమ్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.297 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. వన్డే సారథిగా మొదటి మ్యాచ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ 17 బంతుల్లో 12 పరుగులు చేసిన మార్క్‌రమ్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

    ఆ తర్వాత శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 84 బంతుల్లో 10 ఫోర్లతో 79 పరుగులు చేసిన శిఖర్ ధావన్, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... ఆ తర్వాత రెండు బంతులకే అవుట్ అయ్యాడు.

    63 బంతుల్లో 3 ఫోర్లతో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, షంసీ బౌలింగ్‌లో భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో, 152 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 17 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్ లో డికాక్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


    ఆ వెంటనే రిషబ్ పంత్ 16 పరుగులు చేసి ఫెలుక్వాయో బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ (2), రవిచంద్రన్ అశ్విన్ (7), భువనేశ్వర్ (4) నిరాశపర్చారు. అయితే.. ఆఖర్లో శార్దూల్, బుమ్రా(14) పరుగులు తొమ్మిదో వికెట్ కు అజేయంగా 51 పరుగులు జోడించారు. వీరి పార్టనర్ షిప్ తో టీమిండియా ఓటమి తేడా తప్పింది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు.

    అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, టీమిండియా ముందు 297 భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రస్సీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. బవుమా, డస్సెన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.

    భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. మిగత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ 72 పరుగులు సమర్పించుకొని కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శనను మూటగట్టుకున్నాడు.ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా రాహుల్ వైఫల్యం కన్పించింది. బవుమా, డస్సెన్ భారీ పార్టనర్ షిప్ ని బ్రేక్ చేసేందకు బౌలర్లను మార్చడంలో కెప్టెన్‌గా రాహుల్ విఫలమయ్యాడు. చాహల్, శార్దూల్, భువీ విఫలమవుతున్న వేళ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. అలాగే.. తన బ్యాటింగ్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs South Africa, KL Rahul, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు