INDIA VS SOUTH AFRICA FIRST ODI LIVE CRICKET SCORE UPDATES SOUTH AFRICA SETS HUGE TOTAL ON BOARD SRD
Ind Vs Sa First Odi : బవుమా, డస్సెన్ సూపర్ షో.. టీమిండియా ముందు భారీ టార్గెట్..
Ind Vs Sa (PC : SA Twitter)
Ind Vs Sa First Odi : ఫస్ట్ వన్డేలో భారత్ ముందు భారీ టోటల్ సెట్ చేసింది సౌతాఫ్రికా టీమ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆరో బౌలర్ దొరికాడన్న కేఎల్ రాహుల్.. అతని చేత ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం.
బోలాండ్ పార్క్ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్ (Ind Vs Sa First Odi)లో సౌతాఫ్రికా టీమిండియా (Team India) ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ లో వాన్ డర్ డస్సెస్, కెప్టెన్ బవుమా సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో మెరిశారు. వాన్ డర్ డస్సెన్ ( 96 బంతుల్లో 129 పరుగులు 9 ఫోర్లు, 4 సిక్సర్లు), బవుమా (143 బంతుల్లో 110 పరుగులు, 8 ఫోర్లు ) అదరగొట్టారు. ఓ దశలో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వీరిద్దరి భాగస్వామ్యం పటిష్ట స్థితిలో నిలిపింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 204 పరుగుల భారీ పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చాహల్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ నిరాశపర్చారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆదిలోనే షాక్ తగిలింది. 19 పరుగులకే తొలి వెకట్ ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో మలన్ (6).. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీమిండియా పేసు గుర్రం అద్భుత అవుట్స్వింగర్కు బలైపోయి పెవిలియన్ చేరాడు. క్రీజ్లో కుదురుకుంటున్న స్టార్ ప్లేయర్ డికాక్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
🔁 CHANGE OF INNINGS
Two centuries from Bavuma (110) and van der Dussen (129*) see the #Proteas post 296/4 in their allotted 50 overs🙏
ఫలితంగా దక్షిణాఫ్రికా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే 68 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే త్రోతో మార్క్రమ్(11 బంతుల్లో 4)ను రనౌట్ చేశాడు. 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను కెప్టెన్ బవుమా, వాన్ డర్ డస్సెన్ ఆదుకున్నారు. బవుమా యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా.. డస్సెన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో.. భారత బౌలర్లు ఇబ్బందుల్లో పట్టారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ నో బాల్స్ వేసి.. సౌతాఫ్రికా బ్యాటర్లకు స్కోరు వేగం పెంచే ఛాన్స్ ఇచ్చాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆరో బౌలర్ దొరికాడన్న కేఎల్ రాహుల్.. అతని చేత ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం. ఈ టార్గెట్ ఛేజ్ చేయాలంటే భారత బ్యాటర్లు కచ్చితంగా రాణించాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.