IND vs SA : నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టెస్ట్... సిరీస్ గెలుపే టార్గెట్

IND vs SA 2nd Test : మొదటి టెస్టును భారీ స్కోర్ తేడాతో గెలిచిన టీమిండియా... రెండో టెస్టులోనూ అదే జోరు చూపించేందుకు సిద్ధమైంది.

news18-telugu
Updated: October 10, 2019, 6:51 AM IST
IND vs SA : నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టెస్ట్... సిరీస్ గెలుపే టార్గెట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
India vs South Africa 2nd Test : మరి కాసేపట్లో (ఉదయం 9 గంటల నుంచి) టీమిండియా... సౌతాఫ్రికా మధ్య ఆసక్తికర టెస్ట్ పోరుకు తెరలేవనుంది. ఇందుకోసం పుణెలో రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ టీమిండియా మొదటి టెస్టు గెలిచి... 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ కూడా గెలిచి... సిరీస్‌ను దక్కించుకోవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగుతోంది. వైజాగ్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీలతో కదం తొక్కి... 303 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే... మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక అశ్విన్, మహ్మద్ షమీ, జడేజా, ఇషాంత్ శర్మ... వికెట్ల వేటలో దుమ్ము రేపారు. ఇప్పుడు వీళ్లంతా సెకండ్ టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

సౌతాఫ్రికా మాత్రం రెండో టెస్టును గెలిచి... సిరీస్ సమం చెయ్యాలని ప్రయత్నిస్తోంది. టీ-20లో సిరీస్ సమం చేసి... టీమిండియాను నిరాశ పరిచిన సఫారీలు... టెస్టు సిరీస్‌లోనూ అలాగే చెయ్యాలని భావిస్తున్నారు. ఐతే... మొదటి టెస్టు గెలవడంతో... భారత జట్టులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అందువల్ల మన జట్టును ఢీ కొట్టే విషయంలో సఫారీలు ప్రస్తుతం అంత బలంగా లేరనే చెప్పొచ్చు.

ప్రస్తుత మ్యాచ్‌లో అందరి దృష్టీ... రోహిత్ శర్మపై ఉంది. టీ-20లో దుమ్మురేపే ఈ హిట్ మ్యాన్... టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా టాలెంట్ చూపిస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే... విశాఖ టెస్టులో రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో... రెండో టెస్టులోనూ అదే రిపీట్ చేస్తాడని ఆశిస్తున్నారు.


Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలు


ఇవి కూడా చదవండి :

నేడు ఏపీలో... "వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం" ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే
Published by: Krishna Kumar N
First published: October 10, 2019, 6:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading