India vs South Africa: మూడోరోజు పూనే టెస్టు మ్యాచులో పట్టుబిగించిన భారత్...

మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 3వ రోజు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

news18-telugu
Updated: October 12, 2019, 10:54 PM IST
India vs South Africa: మూడోరోజు పూనే టెస్టు మ్యాచులో పట్టుబిగించిన భారత్...
సౌతాఫ్రికాను ఆదుకున్న మహారాజ్, ఫిలాండర్ (Image : Cricketnext )
news18-telugu
Updated: October 12, 2019, 10:54 PM IST
పూనే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 3వ రోజు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సౌతాఫ్రికా బ్యాట్స్ మ్యాన్ మహారాజ్, ఫిలాండర్ లు తొమ్మదవ వికెట్ కు ఏకంగా 109 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా మహారాజ్ 72 పరుగులతో హాఫ్ సెంచరీతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను మహారాజ్ తీసుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ బౌలింగ్ లో మహారాజ్, రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అ తర్వాత వచ్చిన రబడా(2)ను కూడా అశ్విన్ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 104.5 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...