IND vs SA : భారత్, సౌతాఫ్రికా మూడో టీ20కి వర్షం ముప్పు...

IND vs SA T20 : ఇప్పటికే సిరీస్ ఆధిక్యంలో ఉన్న టీమిండియా... ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే... సిరీస్ కొట్టేసినట్లే. ఐతే... మొదటి మ్యాచ్‌ని రద్దు చేసిన వర్షం... మూడో మ్యాచ్‌కి కూడా అడ్డంకిగా మారేలా ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 5:44 AM IST
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మూడో టీ20కి వర్షం ముప్పు...
భారత్, సౌతాఫ్రికా మూడో టీ20కి వర్షం ముప్పు...
Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 5:44 AM IST
IND vs SA 3rd T20 : సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా... మూడో మ్యాచ్‌కి సర్వసన్నద్ధమైంది. ఎందుకంటే... ఇదివరకు 2015లో ఇదే ప్రొటీస్ టీంతో జరిగిన టీ20లో టీమిండియా... 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈసారి మాత్రం ఛాన్స్ కొట్టేలా కనిపిస్తోంది. ఐతే... ధర్మశాలలో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా... రెండో మ్యాచ్‌లో సఫారీలు చిత్తుగా ఓడిపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఇప్పుడు బెంగళూరు... చిన్నస్వామి స్టేడియంలో మూడో మ్యాచ్ గెలిస్తే... సిరీస్ 2-0తో టీమిండియా వశమవుతుంది. ఫలితంగా నెక్ట్స్ మూడు టెస్టుల సిరీస్‌కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఐతే... సౌతాఫ్రికా ఆ ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగానే ప్రయత్నిస్తోంది. వీళ్ల మధ్యలో అసలు మ్యాచే జరగకుండా చెయ్యాలని వర్షం రెడీ అవుతోంది.

నిజానికి ఈ సిరీస్ భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఆ లోగా టీమిండియాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరగాల్సి ఉంది. అసలే ప్రపంచకప్‌ చేజారిన తరుణంలో... కనీసం టీ20 అయినా గెలిచి తీరాలనే ఒత్తిడి కోహ్లీసేనపై ఉంది. లక్కేంటంటే సఫారీ జట్టు మరీ అంత బలంగా లేదు. కీలక ఆటగాళ్లు రాణించకపోవడం ఆ జట్టుకు కలవరం కలిగిస్తోంది.

భారత్ విషయానికి వస్తే... టాప్ ఆర్డర్ బలంగానే ఉంది. శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో మిడిల్ ఆర్డర్ కూడా పర్వాలేదనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా జట్టును ఆదుకునే అవకాశాలున్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే... వికెట్ కీపర్ రిషబ్ పంత్ పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం అతను సరైన ఫామ్ కనబరచలేకపోతున్నాడు. సీనియర్లైన జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్... జట్టులో లేకపోయినా... సుందర్, దీపక్ చాహర్ వంటి కుర్రాళ్లు పర్వాలేదనిపిస్తున్నారు.

వర్షం రెడీ : లక్కేంటంటే చిన్నస్వామి స్టేడియం పేరుకు తగ్గట్టే చిన్నగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ స్కోర్స్ చేసే వీలుంటుంది. ఐతే... ఆ రెండు జట్లు ఎలాంటి స్కోర్ చేసినా... తాను మాత్రం హైస్కోర్ చేస్తానంటోంది వర్షం. అల్పపీడనం వల్ల స్డేడియంపై మేఘాలు దట్టంగా ఉన్నాయి. ఉరుములు కూడా పడొచ్చంటున్నారు. దీన్ని బట్టీ... రాత్రి 7 గంటలకు జరిగే మ్యాచ్‌కి వర్షం షాక్ ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు.



India vs South Africa 3rd T20 :
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ధవన్‌, హార్దిక్‌, రిషభ్‌ పంత్‌, క్రునాల్‌/రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జడేజా, సైనీ, దీపక్‌ చాహర్‌.

దక్షిణాఫ్రికా జట్టు: డికాక్‌ (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్‌, వాన్‌డర్‌ డుస్సెన్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, ఫార్టున్‌, బవుమా, డాల, రబాడ, షంసీ, మిల్లర్‌.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...