Home /News /sports /

INDIA VS SOUTH AFRICA 3RD ODI SOUTH AFRICA WHITE WASHED INDIA SA WON BY 4 RUNS AGAINST INDIA IN CAPE TOWN MATCH SK

India vs South Africa, 3rd ODI: వైట్ వాష్.. ఆఖరి వన్డేలోనూ అట్టర్ ఫ్లాప్.. చాహర్ పోరాడినా ఓడిన ఇండియా

దీపక్ చాహర్ (Image:BCCI)

దీపక్ చాహర్ (Image:BCCI)

India vs South Africa, 3rd ODI: ఆఖర్లో దీపక్ చాహర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి.. మ్యాచ్‌పై ఆశలు రేపాడు. కానీ కీలకమైన టైమ్‌లో వికెట్ పడడంతో.. టీమిండియాకు ఓటమి తప్పలేదు.

  India vs South Africa, 3rd ODI: సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా అట్టర్ ఫ్లాపైంది. టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. ఈ టూర్ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాని అభిమానులు అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో రాహుల్ సేన పోరాడి ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌..చివరకు దక్షిణాఫ్రికా వశమైంది. సఫారీలు విధించిన 288 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు చేధించలేకపోయింది. 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆలౌటయింది. ఆఖర్లో దీపక్ చాహర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి.. మ్యాచ్‌పై ఆశలు రేపాడు. కానీ అసలైన టైమ్‌లో వికెట్ పడడంతో.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించి భారత జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

  Anushka Sharma With Vamika : అచ్చం తండ్రి పోలిక.. కోహ్లీ ముద్దుల తనయను చూశారా..?

  288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, టీమిండియా కెప్టెన్ కేఎల్. రాహుల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టాడు. ఈ ఇద్దరు హాప్ సెంచరీలతో అదరగొట్టారు. శిఖర్ ధావన్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కొహ్లీ, ధావన్ రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధావన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మొదటి బంతికే వికెట్ సమర్పించున్నాడు. 156 పరుగుల వద్ద విరాట్ కొహ్లీ కూడా ఫెవిలియన్ చేరాడు. 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 26, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేశారు. వీరిద్దరు ఔటౌయిన తర్వాత టీమిండియా పనయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ దీపక్ చాహర్ మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లోనే 54 రన్స్ చేశాడు.

  టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2021గా పాక్ ప్లేయర్..మహ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక

  దీపక్ మ్యాచ్‌ను గెలిపిస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ 48 ఓవర్ తొలి బంతికే అతడు ఔట్ కావడంతో.. ఉత్కంఠ పెరిగింది. దీపక్ ఔటైనప్పటికీ.. చేయాల్సిన పరుగులు తక్కువగానే ఉండడంతో భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా, చాహల్ వెంటవెంటనే వికెట్ సమర్పించుకోవడంతో.. టీమిండియా ఆలౌటయింది. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుండి ఎంగిడి, ఫెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రిటోరస్ 2, సిసండ మగాల, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.

  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన దీపక్ చాహార్, తన రెండో ఓవర్‌ మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 6 బంతుల్లో ఒక్క పరుగు చేసిన జన్నేమన్ మలాన్, కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ బవుమా, కేఎల్ రాహుల్ కొట్టిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. దీంతో 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన మార్క్‌రమ్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత క్వింటన్ డి కాక్, వాన్ డర్ డస్సెన్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న క్వింటన్ డి కాక్, వన్డేల్లో 17వ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 144 పరుగుల విలువైన పార్టనర్ షిప్ ను నెలకొల్పారు.

  ఇది కూడా చదవండి : ఒడియమ్మ బడవ ఇదేందయ్య ఇదీ.. బంగ్లా క్రికెట్ కు కూడా పాకిన పుష్ప మేనియా..

  సెంచరీ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న డికాక్ ను బుమ్రా పెవిలియన్ పంపాడు. బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. ధావన్ కు బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు డికాక్. ఆ తర్వాత వెంటనే చాహల్ బౌలింగ్ లో డస్సెన్ కూడా ఔటయ్యాడు. అయితే, ఆఖర్లో మిల్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడి.. సౌతాఫ్రికాకు మంచి టోటల్ అందించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. యుజ్వేంద్ర చాహల్‌కు ఒక వికెట్ దక్కింది. మొత్తంగా సౌతాఫ్రికా టూర్‌లో భారత్ అట్టర్ ఫ్లాపయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ తప్ప.. ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ పరాజయం పాలయింది. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయి..ఒట్టి చేతులతో స్వదేశానికి రాబోతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, IND Vs SA, Sports, Team India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు