INDIA VS SOUTH AFRICA 3RD ODI LIVE CRICKET SCORE UPDATES TEAM INDIA WON THE TOSS AND OPT TO FIELD FIRST SRD
Ind vs Sa 3rd ODI : టాస్ గెలిచిన భారత్.. నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా..
India vs South Africa
Ind vs Sa 3rd ODI : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. మూడో వన్డేలోనూ పరిస్థితి మారకపోతే వన్డే సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ను కూడా ఎదుర్కోక తప్పదు.
భారీ ఆశలతో దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై అడుగుపెట్టిన భారత్ (Team India) కు నిరాశే ఎదురైంది. 30 ఏళ్ల చరిత్ర సృష్టించాలనే ఆశలు కాస్త చెడిపోయాయి. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. మరోసారి ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్ల్‌లో జరిగిన తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో పరువు దక్కించుకోవడానికి మూడో వన్డే (Ind Vs Sa)లో పోరాటానికి సిద్ధమైంది రాహుల్‌సేన. కనీసం వన్డే సిరీస్‌లో మిగిలిన చివరి మ్యాచ్‌నైనా గెలిచి విజయంతో సౌతాఫ్రికా పర్యటనను ముగించాలని భావిస్తోంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది భారత్. సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చారు. భువీ, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ లపై వేటు పడింది.
ఒక వేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్ అవుతుంది. దీంతో ఆ ప్రమాదం నుంచి బయటపడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయ్.
ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో యువ పేసర్ దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ ని తప్పించి యువ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించింది. వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ లపై కూడా వేటు వేసింది. వారి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలు జట్టులోకి వచ్చారు.
#TeamIndia win the toss and elect to bowl first in the final ODI.
ఇప్పటివరకు కేప్‌టౌన్ వేదికగా 5 వన్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచింది. రెండు ఓడింది. అలాగే ఇక్కడ 37 వన్డే మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా ఏకంగా 31 గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీస్తే టీమిండియా స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ 100 వికెట్ల క్లబ్లో చేరుతాడు. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఇప్పటికి 64 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో చివరిదైన ఈ మ్యచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. దీంతో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో కేప్‌టౌన్ వన్డేలో బరిలోకి దిగనుంది. సౌతాఫ్రికా ఒక మార్పు చేసింది. షంసీ స్థానంలో ప్రిటోరియస్ ను జట్టులోకి తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.