Home /News /sports /

INDIA VS SOUTH AFRICA 3RD ODI LIVE CRICKET SCORE UPDATES SOUTH AFRICA SETS HUGE TOTAL ON BOARD SRD

Ind Vs Sa 3rd ODI : డికాక్ సూపర్ సెంచరీ.. మరోసారి టీమిండియా ముందు టఫ్ టార్గెట్..

Ind Vs Sa (PC : Twitter)

Ind Vs Sa (PC : Twitter)

Ind Vs Sa 3rd ODI : భారత బ్యాటర్ల ముందు మరోసారి టఫ్ టార్గెట్ ను సెట్ చేశారు సౌతాఫ్రికా బ్యాటర్లు. ఈ మ్యాచ్ లో నెగ్గి కనీస పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది.

    టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో మరోసారి సౌతాఫ్రికా సత్తా చాటింది. టీమిండియా ముందు భారీ టోటల్ సెట్ చేసింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ సెంచరీతో దుమ్మురేపాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 124 పరుగులు చేశాడు డికాక్. దీంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌటైంది సఫారీ టీమ్. డికాక్ కు తోడుగా మిడిలార్డర్ బ్యాటర్ వాన్ డర్ డస్సెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డస్సెన్ (59 బంతుల్లో 52 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో రాణించాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు, జస్ప్రీత్ బుమ్రా.. దీపక్ చాహర్ చెరో రెండు వికెట్లతో మెరిశారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 288 పరుగులు చేయాలి. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయింది రాహుల్ సేన.

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన దీపక్ చాహార్, తన రెండో ఓవర్‌ మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 6 బంతుల్లో ఒక్క పరుగు చేసిన జన్నేమన్ మలాన్, కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

    ఆ తర్వాత 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ బవుమా, కేఎల్ రాహుల్ కొట్టిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. దీంతో 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన మార్క్‌రమ్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (సబ్‌స్టిట్యూట్)కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

    అయితే ఆ తర్వాత క్వింటన్ డి కాక్, వాన్ డర్ డస్సెన్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న క్వింటన్ డి కాక్, వన్డేల్లో 17వ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 144 పరుగుల విలువైన పార్టనర్ షిప్ ను నెలకొల్పారు.

    సెంచరీ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న డికాక్ ను బుమ్రా పెవిలియన్ పంపాడు. బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. ధావన్ కు బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు డికాక్. ఆ తర్వాత వెంటనే చాహల్ బౌలింగ్ లో డస్సెన్ కూడా ఔటయ్యాడు. అయితే, ఆఖర్లో మిల్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడి.. సౌతాఫ్రికాకు మంచి టోటల్ అందించాడు.


    ఇక, ఈ మ్యాచులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది భారత్. సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చారు. భువీ, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ లపై వేటు పడింది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే వ‌న్డే సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్ అవుతుంది. దీంతో ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌గా ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

    ఇది కూడా చదవండి : ఒడియమ్మ బడవ ఇదేందయ్య ఇదీ.. బంగ్లా క్రికెట్ కు కూడా పాకిన పుష్ప మేనియా..

    ఇప్ప‌టివ‌ర‌కు కేప్‌టౌన్ వేదిక‌గా 5 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచింది. రెండు ఓడింది. అలాగే ఇక్క‌డ 37 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా ఏకంగా 31 గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేయ‌క ఇప్ప‌టికి 64 ఇన్నింగ్స్‌లు పూర్త‌య్యాయి. దీంతో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో చివ‌రిదైన ఈ మ్య‌చ్‌లో కోహ్లీ సెంచ‌రీ సాధించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, KL Rahul

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు