INDIA VS SOUTH AFRICA 2ND ODI UPDATES SAFARI BATSMAN JANNEMAN MALAN AND QUINTON DE KOCK AHEAD IN CHASING AK
IND vs SA : 2nd ODI Updates: అదరగొడుతున్న సఫారీ ఓపెనర్లు.. భారత్‌కు మళ్లీ ఓటమి తప్పదా ?
దక్షిణాఫ్రికా జట్టు (ఫైల్ ఫోటో)
IND vs SA : 2nd ODI Updates: టార్గెట్ ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికా పెద్దగా తడబడటం లేదు. సఫారీ టీమ్ ఓపెనర్లు మలన్, డికాక్ భారత బౌలర్లను సులభంగా ఎదుర్కొని రన్స్ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓడిన భారత్.. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావించింది. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే టార్గెట్ ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికా పెద్దగా తడబడటం లేదు. సఫారీ టీమ్ ఓపెనర్లు మలన్, డికాక్ భారత బౌలర్లను సులభంగా ఎదుర్కొని రన్స్ చేస్తున్నారు. 18 ఓవర్లలో స్కోర్ బోర్డును 110 పరుగులు దాటించారు. ఓపెనర్ డికాక్ 55 బంతుల్లోనే 77 పరుగులు సాధించి సెంచరీ దిశగా సాగిపోతున్నాడు. మరో ఓపెనర్ మలన్ 42 పరుగులు చేసి హాఫ్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. దీంతో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాజిక్ చేస్తే తప్ప.. రెండో వన్డేలోనూ పరాజయం తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ, కీపర్ రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు చివర్లో శార్థూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (85) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. మొదట్లో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (55) తో పాటు శిఖర్ ధావన్ (29) రాణించారు. దీంతో మొదటి వికెట్ కు 63 పరుగుల భాగాస్వామ్యం దక్కింది. ఫస్ట్ డౌన్ కోహ్లి (0) డకౌట్ తో నిరాశ పరిచాడు.
కానీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 71 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 2 సిక్స్ లను బాదాడు. దీంతో నాలుగో వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం టీమిండియాకు దక్కింది. శ్రేయస్ అయ్యార్ నిరాశ పరిచినా.. వెంకటేష్ అయ్యార్ (22) పర్వలేదని అనిపించాడు. కాగ చివర్లో శార్ధూల్ ఠాకూర్ (40) తో పాటు రవి చంద్రన్ అశ్విన్ (25) పరుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది.
సౌత్ ఆఫ్రికా నుంచి షమ్సీ 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే సిసంద మగల, మార్కామ్, కేశవ్ మహారాజ్, ఆండిలే ఫెహ్లుక్వాయో తలో ఒక వికెట్ తీసుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.