Home /News /sports /

INDIA VS SOUTH AFRICA 2ND ODI SCORE UPDATES TEAM INDIA PUTS 288 TARGET TO SA MKS

IND vs SA : 2nd ODI Updates : చివర్లో శార్దూల్, అశ్విన్ మెరుపులు.. సౌతాఫ్రికా టార్గెట్ 288

రెండో వన్డేలో భారత్ స్కోరు 287

రెండో వన్డేలో భారత్ స్కోరు 287

దక్షిణాఫ్రికాతో బోలండ్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ మెరిసింది. కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (85) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించింది..

ఇంకా చదవండి ...
కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ, కీపర్ రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు చివర్లో శార్థూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బోలండ్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ మెరిసింది.

కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (85) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. మొద‌ట్లో ఓపెన‌ర్లు కెఎల్ రాహుల్ (55) తో పాటు శిఖ‌ర్ ధావ‌న్ (29) రాణించారు. దీంతో మొద‌టి వికెట్ కు 63 ప‌రుగుల భాగాస్వామ్యం ద‌క్కింది. ఫ‌స్ట్ డౌన్ కోహ్లి (0) డ‌కౌట్ తో నిరాశ ప‌రిచాడు.

T20 World Cup 2022 మ్యాచ్‌ల తేదీలు, వేదికలివే: భారత్ తొలి పోరు పాక్‌తో -full schedule



కానీ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ 71 బంతుల్లో 85 ప‌రుగులు చేశాడు. 10 ఫోర్లు, 2 సిక్స్ ల‌ను బాదాడు. దీంతో నాలుగో వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం టీమిండియాకు ద‌క్కింది. శ్రేయ‌స్ అయ్యార్ నిరాశ ప‌రిచినా.. వెంక‌టేష్ అయ్యార్ (22) ప‌ర్వ‌లేద‌ని అనిపించాడు. కాగ చివ‌ర్లో శార్ధూల్ ఠాకూర్ (40) తో పాటు ర‌వి చంద్ర‌న్ అశ్విన్ (25) ప‌రుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు నష్టపోయి 287 ప‌రుగులు చేసింది.

Lockdown : కరోనా సునామీ: పూర్థిస్థాయి లాక్‌డౌన్.. అధికారిక ప్రకటన.. ఈనెల 23 నుంచే..


సౌత్ ఆఫ్రికా నుంచి ష‌మ్సీ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే సిసంద మ‌గ‌ల‌, మార్కామ్, కేశ‌వ్ మ‌హారాజ్, ఆండిలే ఫెహ్లుక్వాయో త‌లో ఒక వికెట్ తీసుకున్నారు. ఇదీల ఉండ‌గా సౌతాఫ్రికా విజ‌యం సాధించాలంటే.. 288 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Cricket, IND Vs SA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు