India vs South Africa: భారత్, సౌతాఫ్రికా తొలి టీ20 వర్షార్పణం...నిరాశలో అభిమానులు

వర్షం ఎంత సేపటికీ తెరిపినివ్వకపోడంతో మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. అయితే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

news18-telugu
Updated: September 15, 2019, 9:38 PM IST
India vs South Africa: భారత్, సౌతాఫ్రికా తొలి టీ20 వర్షార్పణం...నిరాశలో అభిమానులు
తడిసి ముద్దయిన పీల్డ్ (Twitter)
  • Share this:
ధర్మశాల వేదికగా జరగాల్సిన ఇండియా, సౌతాఫ్రికా టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ టాస్ వేయకముందు నుంచే భారీవర్షం మొదలయ్యింది. దీంతో మ్యాచ్ నిర్వాహకులు తొలుత టాస్ వాయిదా వేశారు. అయితే, ఆ తర్వాత కూడా వర్షం ఎంత సేపటికీ తెరిపినివ్వకపోడంతో మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. అయితే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కాగా ఈ నెల 18న మొహాలీలో వేదికగా రెండు టీ20 జరగనుంది.



First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు