India vs Pakistan: ‘ఈ ఒక్క మ్యాచ్ వదిలేయ్ ప్లీజ్’ వరుణుడ్ని కోరుతున్న క్రికెట్ అభిమానులు

India vs Pakistan | World Cup 2019:వర్షాల కారణంగా మ్యాచులు రద్దు అవ్వడంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. మాంచెస్టర్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

news18-telugu
Updated: June 16, 2019, 9:46 AM IST
India vs Pakistan: ‘ఈ ఒక్క మ్యాచ్ వదిలేయ్ ప్లీజ్’ వరుణుడ్ని కోరుతున్న క్రికెట్ అభిమానులు
India vs Pakistan | World Cup 2019: Rain to affect play, full 50 overs match unlikely, ‘ఈ ఒక్క మ్యాచ్ వదిలేయ్ ప్లీజ్’ వరుణుడ్ని కోరుతున్న క్రికెట్ అభిమానులు
  • Share this:
ప్రపంచకప్‌ ప్రతి నాలుగేళ్లకోసారి వస్తుంది. టోర్నీకి ఏడాది ముందే షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఆ సమయంలో ప్రతి క్రికెట్‌ అభిమాని కళ్లూ వెతికేది ఒక్క మ్యాచ్‌ కోసమే. అదే భారత్-పాకిస్తాన్ మ్యాచ్. క్రికెట్ చూడని వాడు.. క్రికెట్ అంటే పడివాడు సైతం చూసే మ్యాచ్ ఇది. కొందరు ఔత్సాహికులు లైవ్‌లో చూసేందుకు క్యూ కడితే.. మరికొందు మాత్రం ఇంట్లో టీవీలకు అతుక్కుపోతారు. ఎన్నిపనులన్నా అన్నింటినీ పక్కన పడేస్తారు. అంతలా జనంలో హైప్ క్రియేట్ చేసిన యుద్ధం లాంటి క్రికెట్ సంగ్రామం... ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్.

వరల్డ్ కప్ 2019లో భాగంగా ఈరోజు ఈ రెండు జట్ల తలపడనున్నాయి. ఇంకొన్ని గంటల్లోనే క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి మహా సమరం ప్రారంభం కానుంది. గత కొన్ని నెలల్లో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు దేశాల అభిమానులకూ ప్రతిష్టాత్మకంగా మారింది. పాక్‌ ఎంతో భీకరంగా ఉన్న రోజుల్లోనూ ప్రపంచకప్‌లో ఆ జట్టుకు తలవంచని భారత్‌.. ప్రస్తుత పాక్‌తో పోలిస్తే బలంగా ఉన్న భారత్‌ సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే అజేయ రికార్డును కొనసాగించడం కష్టం కాదు. ఈ మ్యాచ్‌ ఓడితే పాక్‌ సెమీస్‌ అవకాశాలు కష్టంగా మారుతాయి. కాబట్టి ఆ జట్టు అంత తేలిగ్గా మ్యాచ్‌ను వదిలి అవకాశం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అన్నింటికి పెద్ద దెబ్బ వానగండం.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. మాంచెస్టర్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచకప్‌కే ఆకర్షణ అయిన ఈ మ్యాచ్‌ కూడా రద్దయితే టోర్నీ కళ తప్పడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్‌ జరగాలని ఐసీసీ సైతం ఎంతగానో కోరుకుంటోంది.ఈ మ్యాచ్ జరగకపోతే.. ఐసీసీకి భారీ నష్టం కూడా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానులు సైతం వరుణుడికి పూజలు చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌ను వదిలేయాలని వరుణుడిని అందరూ కోరుకుంటున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: June 16, 2019, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading