India vs Pakistan: తరం మారినా తీరు మారలేదు...పాకిస్థాన్ పై ట్రోలింగ్

కాసిం అక్రం, కెప్టెన్ రోహైల్ నజీర్ 31 ఓవర్లో సింగిల్ తీసే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ కు పరిగెత్తాడు. అయితే అదే ఎండ్ లో ఉన్న కాసిం అక్రం సగం పిచ్ మధ్యకు వచ్చాక మళ్లీ వెనక్కు పరిగెత్తాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్ మెన్ ఒకే ఎండ్ వైపు పరిగెత్తారు. ఫలితంగా పాకిస్థాన్ మరోసారి నవ్వుల పాలైంది.

news18-telugu
Updated: February 4, 2020, 11:25 PM IST
India vs Pakistan: తరం మారినా తీరు మారలేదు...పాకిస్థాన్ పై ట్రోలింగ్
(Image: Twitter)
  • Share this:
అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అయితే ఈ ఓటమికి పాకిస్థాన్ టీమ్ సమిష్టిగా బోలెడు తప్పులు చేసింది. అందులో ప్రధానంగా పాక్ కెప్టెన్ రోహైల్ నజీర్ అలాగే హైదర్ ఆలీ మూడో వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హైదర్ ఆలీ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అయితే హైదర్ ఆలీ ఔట్ అయ్యాక ఆ జట్టుకు మరో భాగస్వామ్యం అవసరమైంది. అయితే ఇక్కడే గమ్మత్తు జరిగింది. ఏంటంటే...కాసిం అక్రం, కెప్టెన్ రోహైల్ నజీర్ 31 ఓవర్లో సింగిల్ తీసే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ కు పరిగెత్తాడు. అయితే అదే ఎండ్ లో ఉన్న కాసిం అక్రం సగం పిచ్ మధ్యకు వచ్చాక మళ్లీ వెనక్కు పరిగెత్తాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్ మెన్ ఒకే ఎండ్ వైపు పరిగెత్తారు. ఫలితంగా పాకిస్థాన్ మరోసారి నవ్వుల పాలైంది. గతంలో ఇదే తరహాలో పాకిస్థాన్ సీనియర్ జట్టు కూడా ఇలాంటి తప్పులే చేసింది. ముఖ్యంగా ఇంజమామ్ ఉల్ హక్ అయితే పలుమార్లు రనౌట్ అయ్యాడు.


First published: February 4, 2020, 11:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading