India Vs Pakistan: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడండి.. క్రికెట్ ఫ్యాన్స్ కోసం జియో బంపర్ ఆఫర్లు

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్ ఉచితంగా చూడాలంటే ఇలా చేయండి (PC: ICC)

India vs Pakistan T20 World Cup 2021: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఉచితంగా చూడాలనుకుంటే జియో మొబైల్ యూజర్లకు పలు ఆఫర్లను ప్రకటించింది. హాట్ స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు పలు ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.

  • Share this:
    ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) జట్లు ఇవాళ రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీ20 వరల్డ్ కప్ 2021లో (T20 World Cup 2021) తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇరు జట్ల మధ్య జరుగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం (Live Broadcast) చేయనున్నది. దీంతో పాటు డిస్నీ + హాట్‌స్టార్ (Disney + Hotstar) యాప్ లేదా వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అయితే టీవీ అందుబాటులో లేని వాళ్లు.. ప్రయాణాల్లో ఉన్నవాళ్లు మొబైల్స్ ద్వారా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడవచ్చు. హాట్‌స్టార్ యాప్ సబ్‌స్క్రిప్షన్ లేనివాళ్ల కోసం మొబైల్ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటించాయి. జియో (JIO), వొడఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు పలు ప్లాన్ల ద్వారా టీ20 వరల్డ్ కప్ వీక్షించేలా ఆఫర్లను ప్రకటించాయి. వీటిలో జియో మొబైల్ ఎన్నో అద్భుతమైన ఆఫర్లను ప్రత్యేకంగా వరల్డ్ కప్ కోసం అందుబాటులో ఉంచింది. కేవలం మ్యాచ్‌ల వీక్షణకే కాకుండా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

    జియో క్రికెట్ ప్లాన్స్...

    - జియో రూ. 499 ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్నది. దీంతో పాటు ప్రతీ రోజు 3 జీబీ డేటా.. అదనంగా మరో 6 జీబీ డేటా వినియోగదారునికి లభిస్తున్నది. ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

    - జియో రూ. 666 ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్నది. దీంతో పాటు ప్రతీ రోజు 2 జీబీ డేటా వినియోగదారునికి లభిస్తున్నది. ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

    - జియో రూ. 888 ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్నది. దీంతో పాటు ప్రతీ రోజు 2 జీబీ డేటా.. అదనంగా మరో 5 జీబీ డేటా వినియోగదారునికి లభిస్తున్నది. ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

    - జియో రూ. 2599 ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్నది. దీంతో పాటు ప్రతీ రోజు 2 జీబీ డేటా.. అదనంగా మరో 10 జీబీ డేటా వినియోగదారునికి లభిస్తున్నది. ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

    - జియో యాడ్ ఆన్ రీచార్జి ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది. రూ. 549 ప్లాన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్నది. దీంతో పాటు ప్రతీ రోజు 1.5 జీబీ డేటా వినియోగదారునికి లభిస్తున్నది. ఇందులో జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
    Published by:John Naveen Kora
    First published: