హోమ్ /వార్తలు /క్రీడలు /

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్ - పాక్ మధ్య సిరీస్!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్ - పాక్ మధ్య సిరీస్!

భారత్- పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు (పాత ఫోటో)

భారత్- పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు (పాత ఫోటో)

దాయాదుల మధ్య ద్వైపాక్షిక పోరుకు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులు చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్ధాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది


దాయాదుల మధ్య ద్వైపాక్షిక పోరుకు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులు చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్ధాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా ప్రయాత్నాలు చేయాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు అదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్‌ స్థానిక మీడియాలో తన కథనాలలో పేర్కొంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు మధ్య సిరీస్‌లు జరగడం అగిపోయింది. దేశాల మధ్య పర్యటనలు కూడా అగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల బరిలోకి దిగుతున్నాయి. ఈ వివాదాలకు ముగింపు పలకాలని త్వరలో రెండు జట్ల మధ్య సిరీస్ జరిగిలే ప్రయాత్నాలు చేస్తున్నట్లు పీసీబీ అధికారి స్పష్టం చేశాడు. 2023లో పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్‌ ఆడుతుందనే తాము ఆశిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్‌ మని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

చివరి సారిగా 2012-13లో పాక్ వేదికగా రెండు జట్లు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత 2008లో ఆసియా కప్‌ కోసం భారత్ పాక్‌లో పర్యటించింది. చివరగా ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి.

First published:

ఉత్తమ కథలు