India vs Pakistan: అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో 172 పరుగులకే పాక్ ఆలౌట్...సత్తా చాటిన యువభారత్

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో పాకిస్థాన్‌పై టీమిండియా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులకే ఆలౌటైంది.

news18-telugu
Updated: February 4, 2020, 5:12 PM IST
India vs Pakistan: అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో 172 పరుగులకే పాక్ ఆలౌట్...సత్తా చాటిన యువభారత్
India vs Pakistan: అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో 172 పరుగుకే పాక్ ఆలౌట్
  • Share this:
అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో పాకిస్థాన్‌పై టీమిండియా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. అండర్ 19 టీమిండియా బౌలర్లలో సుషాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ వరుసగా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 2వ ఓవర్లోనే మహ్మద్ హురైరా(4) ఔట్ అవడంతో తొలి దెబ్బ తగిలింది. అలాగే 8వ ఓవర్లో ఫహాద్ మునీర్(0) సైతం పరుగలేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రొహైల్ నజీర్(62), హైదర్ అలీ(56)తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే పని చేశారు. ఆ తర్వాత 25 ఓవర్లో హైదర్ కూడా ఔట్ కావడంతో పాకిస్థాన్ 96 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. తరువాత బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల పరుగులు కూడా చేయకుండా వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లకే 172 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 173 పరుగుల లక్ష్యం నిలివడంతో సెమీఫైనల్ లో గెలుపు నల్లేరు నడకే అని అభిమానులు భావిస్తున్నారు.
First published: February 4, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading