India vs Pakistan: నిలకడగా ఆడుతున్న యువ టీమిండియా...వికెట్ కోల్పోకుండానే...

అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా యువజట్టు నిలకడగా రాణిస్తోంది. పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు నిలకడగా ఛేదిస్తోంది.

news18-telugu
Updated: February 4, 2020, 6:51 PM IST
India vs Pakistan: నిలకడగా ఆడుతున్న యువ టీమిండియా...వికెట్ కోల్పోకుండానే...
(Image: BCCI)
  • Share this:
సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా యువజట్టు నిలకడగా రాణిస్తోంది. పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు నిలకడగా రాణిస్తూ ఛేదిస్తోంది. 18 ఓవర్లు ముగిసే నాటికి జట్టు స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు దాటింది. యువ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా నిలకడగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. అండర్ 19 టీమిండియా బౌలర్లలో సుషాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ వరుసగా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 2వ ఓవర్లోనే మహ్మద్ హురైరా(4) ఔట్ అవడంతో తొలి దెబ్బ తగిలింది. అలాగే 8వ ఓవర్లో ఫహాద్ మునీర్(0) సైతం పరుగలేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రొహైల్ నజీర్(62), హైదర్ అలీ(56)తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే పని చేశారు.

ఆ తర్వాత 25 ఓవర్లో హైదర్ కూడా ఔట్ కావడంతో పాకిస్థాన్ 96 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. తరువాత బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల పరుగులు కూడా చేయకుండా వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లకే 172 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 173 పరుగుల లక్ష్యం నిలివడంతో సెమీఫైనల్ లో గెలుపు నల్లేరు నడకే అని అభిమానులు భావిస్తున్నారు.
First published: February 4, 2020, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading