India vs Pakistan: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో పాకిస్థాన్‌ చిత్తు...యువభారత్ వీర విహారం...

India vs Pakistan: పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు సునాయసంగా ఛేదించింది. యువ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా అద్భుతంగా రాణించడంతో వికెట్లేమీ కోల్పోకుండానే 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.

news18-telugu
Updated: February 4, 2020, 7:49 PM IST
India vs Pakistan: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో పాకిస్థాన్‌ చిత్తు...యువభారత్ వీర విహారం...
(image: BCCI)
  • Share this:
India vs Pakistan: సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా యువజట్టు పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు సునాయసంగా ఛేదించింది. యువ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(105), దివ్యాంశ్ సక్సేనా(59) అద్భుతంగా రాణించడంతో వికెట్లేమీ కోల్పోకుండానే 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఏకంగా సెంచరీ చేసి పాకిస్థాన్ బౌలర్లను చిత్తు చేశాడు.  ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. అండర్ 19 టీమిండియా బౌలర్లలో సుషాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ వరుసగా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 2వ ఓవర్లోనే మహ్మద్ హురైరా(4) ఔట్ అవడంతో తొలి దెబ్బ తగిలింది. అలాగే 8వ ఓవర్లో ఫహాద్ మునీర్(0) సైతం పరుగలేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రొహైల్ నజీర్(62), హైదర్ అలీ(56)తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే పని చేశారు.

ఆ తర్వాత 25 ఓవర్లో హైదర్ కూడా ఔట్ కావడంతో పాకిస్థాన్ 96 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. తరువాత బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల పరుగులు కూడా చేయకుండా వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లకే 172 పరుగులకు ఆలౌటైంది.
First published: February 4, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading