India vs Pakistan: హిట్ మ్యాన్ రోహిత్ సెంచరీ...పాక్ బౌలర్లకు చుక్కలే...

India vs Pakistan | ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 85 బంతుల్లో రోహిత్ 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు. 31 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు 180 పరుగుల దాటింది.

news18-telugu
Updated: June 16, 2019, 8:13 PM IST
India vs Pakistan: హిట్ మ్యాన్ రోహిత్ సెంచరీ...పాక్ బౌలర్లకు చుక్కలే...
సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ (Image : Twitter)
news18-telugu
Updated: June 16, 2019, 8:13 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 85 బంతుల్లో రోహిత్ 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు. 31 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 180 పరుగుల దాటింది. ఇదిలా ఉంటే టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం పలికారు. తొలి వికెట్ కు ఏకంగా 136 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. మరోవైపు రోహిత్ శర్మ మూడు సిక్సర్లు, 9 బౌండరీలతో పాక్ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.

మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...