India vs Pakistan | వర్షంతో నిలిచిన మ్యాచ్...46.4 ఓవర్లకు భారత్ స్కోరు 305/4

India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester | ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారండంతో భారత్ స్కోరు 46.4 ఓవర్లకు 305/4 పరుగుల వద్ద నిలిచిపోయింది. క్రీజులో కోహ్లీ(71), విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: June 16, 2019, 6:48 PM IST
India vs Pakistan | వర్షంతో నిలిచిన మ్యాచ్...46.4 ఓవర్లకు భారత్ స్కోరు 305/4
కవర్స్ తో కప్పిన పిచ్
news18-telugu
Updated: June 16, 2019, 6:48 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester | మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారండంతో భారత్ స్కోరు 46.4 ఓవర్లకు 305/4 పరుగుల వద్ద నిలిచిపోయింది. క్రీజులో కోహ్లీ(71), విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తరపున ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం పలికారు. తొలి వికెట్ కు ఏకంగా 136 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించేందుకు పునాదులు పడ్డాయి. అనంతరం రోహిత్ శర్మ 140 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ సైతం 62 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా 26 పరుగులు చేసి ఔట్ కాగా, ధోనీ మాత్రం కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచులో కెప్టెన్ కోహ్లీ 11 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.

మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...