India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్...ఇండియాకు బ్యాటింగ్ ఆహ్వానం...
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
news18-telugu
Updated: June 16, 2019, 3:07 PM IST

టాస్ వేస్తున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ
- News18 Telugu
- Last Updated: June 16, 2019, 3:07 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేయనుంది. కాగా తుది జట్టులో గాయంతో జట్టు నుంచి దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ ను ఆడనున్నాడు. అలాగే అటు పాక్ జట్టులో సైతం రెండు మార్పులు ఉన్నాయి. పాకిస్థాన్ తుది జట్టులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం ఆడనున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో వరల్డ్ కప్ లో మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న టీమిండియాకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకమైనది. అటు పాకిస్థాన్ సైతం ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో రాణించాలని ప్రయత్నం చేయనుంది.
ఇదిలా ఉంటే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.

Pakistan win the toss and will bowl first at Old Trafford!
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
క్రికెట్ చూడడానికి వచ్చిన పాము.. పంపేసిన ప్లేయర్లు...
India vs West Indies: విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి...కోహ్లీ సేనకు షాక్
India vs West Indies: విండీస్ లక్ష్యం 171 పరుగులు...గెలిస్తే సిరీస్ టీమిండియాకే...
India vs West Indies: కోహ్లీ ఔట్...రాణించిన దూబే...వికెట్ల వేటలో విండీస్
India vs West Indies: విండీస్‌పై భారత్ ఘనవిజయం...భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ..
India vs West Indies: టీమిండియా లక్ష్యం 208 పరుగులు...చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/tShfPkCmel— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019Loading...
Loading...