India vs Pakistan | అదరగొట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్...పాకిస్థాన్ టార్గెట్ 337 రన్స్...

India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester | ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 337 పరుగుల లక్ష్యం పాక్ ముందు ఉంచింది. వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 స్కోరు సాధించింది.

news18-telugu
Updated: June 16, 2019, 8:10 PM IST
India vs Pakistan | అదరగొట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్...పాకిస్థాన్ టార్గెట్ 337 రన్స్...
రోహిత్ శర్మ (Image : Twitter)
news18-telugu
Updated: June 16, 2019, 8:10 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester | మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 337 పరుగుల లక్ష్యం పాక్ ముందు ఉంచింది. వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తరపున ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం పలికారు. తొలి వికెట్ కు ఏకంగా 136 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించేందుకు పునాదులు పడ్డాయి. అనంతరం రోహిత్ శర్మ 140 పరుగులు చేసి 27వ వన్డే సెంచరీ నమోదు చేయడం విశేషం. మరోవైపు కెప్టెన్ కోహ్లీ(77)  సైతం అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యా వేగంగా 26 పరుగులు చేసి ఔట్ అయితే, కాగా ధోనీ మాత్రం కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అలాగే చివరి ఓవర్లలో కోహ్లీ ఔట్ కాగా, విజయ్ శంకర్ 15 పరుగులు, కేదార్ జాదవ్ 9 పరుగులు సాధించారు. కాగా ఈ మ్యాచులో కెప్టెన్ కోహ్లీ 11 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ 3 వికెట్లు పడగొట్టగా, హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...