India vs Pakistan | ఉత్కంఠభరిత మ్యాచ్‌లో నిద్రమత్తులో పాకిస్థాన్ కెప్టెన్...తల పట్టుకుంటున్న పాక్ అభిమానులు...

India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester | పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక ఫీల్డ్ సెట్ చేస్తున్న క్రమంలో దీర్ఘంగా ఆవులింత తీయడం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్ కు నిద్ర ఎలా ముంచుకొస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

news18-telugu
Updated: June 16, 2019, 8:50 PM IST
India vs Pakistan | ఉత్కంఠభరిత మ్యాచ్‌లో నిద్రమత్తులో పాకిస్థాన్ కెప్టెన్...తల పట్టుకుంటున్న పాక్ అభిమానులు...
ఆవులిస్తున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్
news18-telugu
Updated: June 16, 2019, 8:50 PM IST
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester |  మాంచెస్టర్ లో జరుతున్న ఉత్కంఠభరితమైన భారత్ పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక ఫీల్డ్ సెట్ చేస్తున్న క్రమంలో దీర్ఘంగా ఆవులింత తీయడం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్ కు నిద్ర ఎలా ముంచుకొస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే మ్యాచ్ లో సర్ఫరాజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సైతం టెయిలెండర్‌ బ్యాట్స్‌మెన్ కు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా తన వివాదాస్పద చర్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న సర్ఫారాజ్ భారత్ పాక్ మ్యాచ్ లోనూ ఆవులిస్తూ దొరికిపోవడంతో అతడిని నెటిజన్లు ఒక ఆటఆడుకుంటున్నారు.First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...