ఔట్ కాకుండానే వెళ్లిపోయిన కొహ్లీ...డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి..

కొహ్లీ చేసిన తప్పుపై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఎంపైర్ ప్రకటించనప్పుడు క్రీజును వదిలివెళ్లాల్సిన అవసరమేంటని విమర్శిస్తున్నారు.

news18-telugu
Updated: June 16, 2019, 8:12 PM IST
ఔట్ కాకుండానే వెళ్లిపోయిన కొహ్లీ...డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి..
విరాట్ కొహ్లీ
news18-telugu
Updated: June 16, 2019, 8:12 PM IST
మాంచెస్టర్ మ్యాచ్‌లో రోహిత్ 140 రన్స్‌తో రఫ్పాడించగా..విరాట్ కొహ్లీ 77 పరుగులో సత్తా చాటాడు. వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చిన కాసేపటికే కొహ్లీ ఔట్ అయ్యాడు. అమీర్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐతే పాక్ క్రికెటర్ల అప్పీల్‌కు అంపైర్ స్పందించ లేదు. దాన్ని ఔట్‌గా ప్రకటించలేదు. కానీ కొహ్లీ మాత్రం తనకు తానుగా క్రీజును వదిలి వెళ్లిపోయాడు. ఐతే రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. బంతి బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది.

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు కొహ్లీ. రిప్లే చూసి షాకయ్యాడు. అయ్యో.. ఔట్ కాకుండానే అనవసరంగా వెనుదిరిగానన్న పశ్చాతాపం అతడిలో కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్ హ్యాండిల్‌ను కోపంతో పదే పదే ఊపుతూ కనిపించాడు కొహ్లీ. ధోనీ సైతం అతడి బ్యాట్‌ను చూసి పరిశీలించాడు. ఐతే హ్యాండిల్ విరగడం వల్లే బంతిని తాకినట్లుగా సౌండ్ వచ్చిందని తెలిసింది. అందుకే అంపైర్ ప్రకటించకున్నా కొహ్లీ తనకు తానుగా వెనుదిరిగాడు.

కొహ్లీ చేసిన తప్పుపై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఎంపైర్ ప్రకటించనప్పుడు క్రీజును వదిలివెళ్లాల్సిన అవసరమేంటని విమర్శిస్తున్నారు. చివరి రెండు ఓవర్లు కొహ్లీ క్రీజులో ఉంటే స్కోరు మరింత పెరిగేదని..భారత్ 350 పరగులు చేసి ఉండేదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో 11వేల పరుగులు చూసి అత్యంత వేగంగా ఆ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కొహ్లీ రికార్డు సాధించాడు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...