India vs Pakistan: రాణిస్తున్న ఓపెనర్లు...అదరగొడుతున్న రోహిత్...

India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు వికెట్లేమీ కోల్పోకుండా 46 పరుగులు చేసింది.

news18-telugu
Updated: June 16, 2019, 8:14 PM IST
India vs Pakistan: రాణిస్తున్న ఓపెనర్లు...అదరగొడుతున్న రోహిత్...
రోహిత్ శర్మ (Image : Twitter)
  • Share this:
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు వికెట్లేమీ కోల్పోకుండా 46 పరుగులు చేసింది.

మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.
Published by: Krishna Adithya
First published: June 16, 2019, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading