India Vs Pakistan: దుబాయ్‌లో మ్యాచ్ అంటే పాకిస్తాన్ సొంత గడ్డపై ఆడుతున్నట్లే.. విజయం కోసం టీమ్ ఇండియా చెమటోడ్చాల్సిందే

టీమ్ ఇండియా కంటే పాకిస్తాన్ జట్టేకే విజయావకాశాలు ఎక్కువ.. ఎందుకంటే?

T20 World Cup 2021: ఇండియా - పాకిస్తాన్ మధ్య తొలి లీగ్ మ్యాచ్ ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్నది. అయితే ఈ గ్రౌండ్‌లో ఇండియా కంటే పాకిస్తాన్ జట్టే ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. భారత జట్టు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మ్యాచ్‌ను పూర్తిగా తమ వశం చేసుకునే అవకాశం పాకిస్తాన్‌కు ఉన్నది.

  • Share this:
    ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ (Cricket) ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ (2019 ODI World Cup) తర్వాత ఇరు జట్లు ఇంత వరకు మ్యాచ్ ఆడలేదు. కరోనా కారణంగా ఇండియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను (T20 World Cup) యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు సీజన్ల ఐపీఎల్ (IPL) టోర్నీ యూఏఈలోనే నిర్వహించారు. దీంతో భారత క్రికెటర్లకు (Team India) అక్కడి స్టేడియంలకు బాగా అలవాటు పడ్డారని.. కచ్చితంగా టీమ్ ఇండియా ఈ సారి మంచి ప్రదర్శన చేసి కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవల్సిన మరో విషయం ఏంటంటే.. యూఏఈ పిచ్‌లపై.. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియంలలో ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లు 10 నుంచి 15 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడి ఉండరు. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం గత కొన్నేళ్లుగా అక్కడే క్రికెట్ ఆడుతున్నది. ఇరత దేశాలకు చెందిన జట్లు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరించడంతో యూఏఈ వేదికగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహిస్తున్నారు.

    యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు 2016 నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్నది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. అన్నింటా గెలిచింది. దుబాయ్ పిచ్‌లు ఎలా ఉంటాయో పాకిస్తాన్ క్రికెటర్లకు తెలిసినంతగా.. ఇతర దేశాల క్రికెటర్లకు తెలియదు. ఐపీఎల్ ఆడటం ద్వారా భారత క్రికెటర్లకు కాస్త అవగాహన ఉన్నా.. పాకిస్తాన్ ఆడినంత క్రికెట్ అక్కడ ఆడకపోవడం టీమ్ ఇండియాకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌తో వారి సొంత గడ్డపై టీమ్ ఇండియా మ్యాచ్ ఆడుతున్నట్లే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

    INDvsPAK: వరల్డ్ కప్‌లో అలాంటి మ్యాచ్ మరెప్పుడూ జరగలేదు.. పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా అరుదైన రికార్డు




    టీ20 ఫార్మాట్‌లో ఇండియా-పాకిస్తాన్ 8 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఏడింట భారత జట్టు విజయం సాధించింది. ఇక గత మూడేళ్లలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ 1173 పరుగులు కేవలం టీ20 ఫార్మాట్‌లోనే సాధించగా.. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 993 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో కోహ్లీ అవుట్ కాకుండా నిలిచాడు. 2012లో 78 పరుగులు, 2014లో 36, 2016లో 55 పరుగులు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌లలో టీమ్ ఇండియానే విజయం సాధించింది. 2007 ఫైనల్‌లో భారత జట్టు చేసిన 157/7 స్కోరే ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు.
    Published by:John Naveen Kora
    First published: