Ind vs NZ 1st T20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

Ind vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో పఠాన్ బ్రదర్స్ చోటు దక్కించుకున్నారు. అలాగే వికెట్ కీపర్లు మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), దినేష్ కార్తిక్, రిషభ్ పంత్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

Krishna Kumar N | news18-telugu
Updated: February 6, 2019, 12:38 PM IST
Ind vs NZ 1st T20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్(Photo: BCCI/Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: February 6, 2019, 12:38 PM IST
భారత్-న్యూజిలాండ్‌ల మధ్య టీ20 మ్యాచ్‌ల సిరీస్ షురూ అయ్యింది. టాస్ గెలిచిన భారత్... ఫీల్డింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు ఇదే జోరును టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. న్యూజిలాండ్ గడ్డపై ఇదివరకు భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల ఫలితాల్లో ఆతిథ్య జట్టుదే పైచేయిగా ఉంది. అక్కడ ఇప్పటివరకు జరిగిన 9 టీ20 మ్యాచ్‌లలో టీంఇండియా రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి భారత జట్టు బలంగా ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ దుమ్ము రేపుతోంది. ఒక్క మిడిల్ ఆర్డర్ మాత్రం కాస్త బలపడాల్సి ఉందని నిపుణులు విశ్లేషించారు. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచినందువల్ల టీంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అందువల్ల ఈసారి టీ20పైనా అంచనాలు బాగా పెరిగాయి.





తొలి టీ20 మ్యాచ్‌లో తుది 11 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇదే..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ముగ్గురు భారత వికెట్ కీపర్లు జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దినేష్ కార్తిక్, రిషభ్ పంత్‌లు 11 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. పఠాన్ సోదరులు ఇద్దరూ కలిసి మ్యాచ్ ఆడుతుండడం విశేషం.



India vs New Zealand T20s schedule
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వెల్లింగ్టన్‌లో జరుగుతోంది. రెండో టీ20 మ్యాచ్ అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఫిబ్రవరి 8న జరగనుండగా... ఫైనల్ మ్యాచ్ హమిల్టన్‌లో ఫిబ్రవరి 10న జరగనుంది.

రెండో టీ20 మ్యాచ్: ఫిబ్రవరి 8, ఈడెన్ పార్క్, అక్లాండ్. ఉదయం 11.30 గం.లకు (భారత కాలమానం ప్రకారం)
మూడో టీ20 మ్యాచ్: ఫిబ్రవరి 10, సెడాన్ పార్క్, హమిల్టన్. మధ్యాహ్నం 12.30 గం.లకు(భారత కాలమానం ప్రకారం)

India vs New Zealand T20 Squads
India squad: Rohit Sharma(c), Shikhar Dhawan, Rishabh Pant, Dinesh Karthik, Kedar Jadhav, MS Dhoni, Krunal Pandya, Kuldeep Yadav, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Siddarth Kaul, K Khaleel Ahmed, Shubman Gill, Vijay Shankar, Hardik Pandya

New Zealand squad: Kane Williamson (c), Doug Bracewell, Colin de Grandhomme, Lockie Ferguson, Scott Kuggeleijn, Daryl Mitchell, Colin Munro, Jimmy Neesham, Mitchell Santner, Tim Seifert, Ish Sodhi, Tim Southee, Ross Taylor.

Video: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు...ఆరుగురికి తీవ్ర గాయాలు
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...