Ind vs NZ 2nd T20 : Ind vs NZ 2nd T20 : టీం ఇండియా టార్గెట్ 159... కొడితే సిరీస్ సమం...

Ind vs NZ 2nd T20: న్యూజిలాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 8, 2019, 1:18 PM IST
Ind vs NZ 2nd T20 : Ind vs NZ 2nd T20 : టీం ఇండియా టార్గెట్ 159... కొడితే సిరీస్ సమం...
టీంఇండియా (Image / Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: February 8, 2019, 1:18 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. సిరీస్ ఎలాగైనా సమం చెయ్యాలనుకుంటున్న టీంఇండియా... టార్గెట్ ఛేదనకు రెడీ అవుతోంది. ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో ఇండియా, కివీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. మూడు మ్యాచుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి... సిరీస్ నెగ్గేయాలనే ఆలోచనతో కేన్ విలియంసన్ టీమ్ ఉంటే... సిరీస్ మీద ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా ఉంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా గెలిస్తే, సిరీస్ సమం అవుతుంది. అదే కివీస్ గెలిస్తే, సిరీస్ వారి వశం అవుతుంది.

న్యూజిలాండ్ టూర్ ముగియక ముందే ‘రన్ మెషిన్’ కెప్టెన్ విరాట్ కోహ్లీ... విశ్రాంతి తీసుకోవడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టేసింది. కోహ్లీ లేకుండా ఆడిన నాలుగో వన్డేలో చిత్తుగా ఓడిన రోహిత్ టీమ్... చివరి వన్డేల్లో స్కోర్ చేయడానికి పోరాడాల్సి వచ్చింది. అంబటిరాయుడు, విజయ్ శంకర్, హర్దిక్ పాండ్యాల కారణంగా గౌరవప్రదమైన స్కోరు చేసి దాన్ని కాపాడుకోగలిగింది. మొదటి టీ20 మ్యాచ్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్లు ఉన్నా... ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఫలితం టీ20ల్లోనే అతి పెద్ద ఓటమి. దాంతో రెండో టీ20 మ్యాచ్‌కి ముందు ఒత్తిడిలో పడింది రోహిత్ గ్యాంగ్. ముఖ్యంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉన్న రోహిత్... నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ చేజార్చుకుంటుండటం జట్టును ఆందోళనలోకి నెట్టేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది.

India vs New Zealand T20s schedule

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వెల్లింగ్టన్‌లో జరిగింది. అందులో న్యూజిలాండ్ గెలుపొందింది.


రెండో టీ20 మ్యాచ్ అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరుగుతోంది.
మూడో టీ20 మ్యాచ్: ఫిబ్రవరి 10, సెడాన్ పార్క్, హమిల్టన్. మధ్యాహ్నం 12.30 గం.లకు(భారత కాలమానం ప్రకారం)

India vs New Zealand T20 Squads
Loading...
India : RG Sharma (c), KK Ahmed, YS Chahal, S Dhawan, MS Dhoni, KM Jadhav, KD Karthik, S Kaul, Kuldeep Yadav, B Kumar, Mohammed Siraj, HH Pandya, KH Pandya, RR Pant, V Shankar, Shubman Gill

Newzealand : KS Williamson (c), DAJ Bracewell, C de Grandhomme, LH Ferguson, SC Kuggeleijn, DJ Mitchell, C Munro, MJ Santner, TL Seifert, IS Sodhi, TG Southee, LRPL Taylor, BM Tickner

 

Video: ఫోన్ మాట్లాడుతున్న మహిళను రౌండప్ చేసి... చైన్ స్నాచింగ్...
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626