వీడియో: క్యా క్యాచ్ హై....గాల్లో ఎగిరి క్యాచ్ పట్టిన హార్థిక్ పాండ్యా

17 ఓవర్లలో చాహల్ బౌలింగ్‌ చేస్తున్నారు. అతను వేసిన బంతికి భారీ షాట్ కొట్టే దిశగా బ్యాట్ ఎత్తాడు విలియమ్సన్. అయితే ఈ బంతిని పాండ్యా గాల్లోనే ఎగిరి అందుకున్నాడు. దీంతో కివీస్ కెప్టెన్ జోరుకు బ్రేక్ లేశాడు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: January 28, 2019, 11:51 AM IST
వీడియో: క్యా క్యాచ్ హై....గాల్లో ఎగిరి క్యాచ్ పట్టిన హార్థిక్ పాండ్యా
గాల్లో ఎగిరి క్యాచ్ పెట్టిన హార్థిక్ పాండ్యా
  • Share this:
harన్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అదరగొట్టాడు. అతనిపై బీసీసీఐ సస్సెన్షన్ ఎత్తివేసిన తర్వాత పాండ్య ఆడుతున్న తొలి మ్యాచ్ ిదే. దీంతో తన సత్తా చూపించాడు పాండ్యా. విలియమ్సన్ కొట్టిన భారీ షాట్‌కు గాల్లో ఎగిరి మరి మ్యాజిక్ చేశాడు. బంతిని చేజారనివ్వకుడా అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

17 ఓవర్లలో చాహల్ బౌలింగ్‌ చేస్తున్నారు. అతను వేసిన బంతికి భారీ షాట్ కొట్టే దిశగా బ్యాట్ ఎత్తాడు విలియమ్సన్. అయితే ఈ బంతిని పాండ్యా గాల్లోనే ఎగిరి అందుకున్నాడు. దీంతో కివీస్ కెప్టెన్ జోరుకు బ్రేక్ లేశాడు.టేలర్‌తో కలిసి ఆడుతున్న విలయమ్సన్‌కు పెవిలీయన్ బాట పట్టించాడు. దీంతో ఇప్పుడు పాండ్యా పట్టిన ఈ వండర్ క్యాచ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏం పట్టాడురా అంటూ నెటిజన్లంతో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవలే పాండ్యా, మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మహిళలను కించ పరుస్తూ.. పాండ్యా చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబట్టారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాదు.. సెక్సిస్ట్, ఉమెన్ హేటర్ లాంటి పదాలను ఉపయోగిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. దీంతో హార్థిక్ పాండ్యా, ఓపెనర్ కెఎల్ రాహుల్ లపై బీసీసీఐ రెండుమ్యాచ్ ల నిషేధం విధించింది.


 
First published: January 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>