భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో మరోసారి అదృష్టం భారత్‌నే వరించింది. వరుసగా రెండోసారి సూపర్ ఓవర్లో కూడా న్యూజిలాండ్ ఓటమి పాలైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 13 పరుగులు మాత్రమే చేసింది. సీఫెర్ట్, మన్రో బ్యాటింగ్‌కు దిగారు. అయితే, నాలుగో బంతికి సీఫెర్ట్ ఔట్ అయ్యాడు. అతడి స్థానంలో స్కాట్ బరిలోకి దిగాడు. భారత్ బౌలర్ బుమ్రా మంచి బంతులు సంధించినా.. ఫీల్డింగ్ లోపాల వల్ల ఆ మాత్రం పరుగులు వచ్చాయి. అనంతరం భారత్ తరఫున కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగారు. కేఎల్ రాహుల్ రావడంతోనే రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌లో గెలుపును ఖాయం చేశాడు. అయితే, మూడోబంతికి ఔట్ అయ్యాడు. రాహుల్ ప్లేస్‌లో సంజు శాంసన్ వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ చాలా సింపుల్‌గా 2 రన్స్ తీశాడు. ఐదో బాల్‌కు ఫోర్ కొట్టి న్యూజిలాండ్ గడ్డ మీద భారత్‌కు వరుసగా నాలుగో టీ20 విజయాన్ని అందించాడు. ఐదు టీ20ల సిరిస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. అందులో మూడు, నాలుగు టీ20లు టై అయ్యాయి. మూడో టీ20లో రోహిత్ శర్మ భారత్‌కు విజయాన్ని అందిస్తే, నాలుగో టీ20లో కేఎల్ రాహుల్, కోహ్లీ జట్టును గెలుపుతీరానికి చేర్చారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా న్యూజిలాండ్‌కు గెలుపు అవకాశాలు ఉన్నా.. ఒత్తిడి కారణంగా మ్యాచ్ టై వరకు వెళ్లింది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 165 పరుగులు చేసింది. 8 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (39 పరుగులు), ఎంకే పాండే (50 పరుగులు) చేయడంతో భారత్ కొంచెం మెరుగైన స్కోర్ చేయగలిగింది. శాంసన్ (8), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (1), శివమ్ దూబే (12), వాషింగ్టన్ సుందరం (డకౌట్), ఠాకూర్ (20), చాహల్ (1) పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 166 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో చివరి ఓవర్లో బోల్తా పడింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, అద్భుతమైన బౌలింగ్ చేసిన శార్థూల్ ఠాకూర్ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడు వికెట్లు పడ్డాయి. దీంతో రెండు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్ ఆడారు.
బూమ్రా వేసిన సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటింగ్
0.1- 2 పరుగులు (క్యాచ్ మిస్)
0.2- 4 పరుగులు
0.3- 2 పరుగులు (క్యాచ్ మిస్ )
0.4- ఔట్ (సీఫెర్ట్ )
0.5-4 పరుగులు
0.6- 1 పరుగులు
సౌథీ వేసిన సూపర్ ఓవర్లో భారత్ బ్యాటింగ్
0.1 - 6 పరుగులు
0.2 - 4 పరుగులు
0.3 - ఔట్
0.4 - 2 పరుగులు
0.5 - 4 పరుగులు
0.6 -
అంతకు ముందు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసిన 20వ ఓవర్. శార్థూల్ ఠాకూర్ 20వ ఓవర్ వేశాడు. చివరి ఓవర్లో గెలుపుకోసం 7 పరుగులు చేయాలి. కానీ, కివీస్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌కు దారితీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.