Ind vs NZ 3rd ODI : మూడో వన్డేలో 243 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్... టీంఇండియా టార్గెట్ 244

India vs Newzealand 3rd ODI : 10 సంవత్సరాల తర్వాత కివీస్ గడ్డ మీద వన్డే సిరీస్ గెలవాలనే తపనలో విరాట్ సేన... మూడో వన్డేలో గెలిచి, సిరీస్ నిలుపుకోవాలనే ఆలోచనలో కివీస్ టీమ్. ఫలితంగా మ్యాచ్ రంజుగా సాగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 28, 2019, 11:31 AM IST
Ind vs NZ 3rd ODI : మూడో వన్డేలో 243 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్... టీంఇండియా టార్గెట్ 244
భారత జట్టు
Krishna Kumar N | news18-telugu
Updated: January 28, 2019, 11:31 AM IST
సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఆరంభంలోనే ఓపెనర్లు మన్రో (7), గప్తిల్‌ (13) వికెట్లను కోల్పోయింది. షమీ వేసిన రెండో ఓవర్‌ చివరి బంతికి మన్రో(7) రోహిత్‌ శర్మకు స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికే గప్తిల్... కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా 7 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ స్కోరు 27/2గా నమోదైంది. ఆ తర్వాత జాగ్రత్తగా ఆడిన టేలర్, కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడారు. 11 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ రెండు వికెట్ల కోల్పోయి 50 పరుగులు చేసింది.

ఐతే... కివీస్‌ కెప్టెన్ విలియమ్సన్‌ 28 రన్స్ చేసి... 17వ ఓవర్లో చాహల్‌ వేసిన బంతిని పాండ్యకు క్యాచ్‌ ఇచ్చాడు. అలా మ్యాచ్ 21 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్‌ మూడు వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ మరింత జాగ్రత్తగా ఆడింది. రాస్ టేలర్, లాథమ్... మెల్లమెల్లగా దూకుడు పెంచుతూ ఆడారు. ఆ క్రమంలో టేలర్ ఎట్టకేలకు 50 రన్స్ పూర్తి చేశాడు. మ్యాచ్ 33 ఓవర్లు పూర్తి అయ్యే సరికి కివీస్‌ మూడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.

దాదాపు 20 ఓవర్ల నుంచి వికెట్‌ కోల్పోకుండా నిలకడగా ఆడుతున్న లాథమ్‌-టేలర్‌ జోడీని చాహల్‌ విడదీశాడు. 38 ఓవర్లో చాహల్‌ వేసిన బంతికి లాథమ్ (51) భారీ షాట్‌ ఆడబోయి రాయుడు చేతికి చిక్కాడు. దీంతో 119 పరుగుల లాథమ్‌-టేలర్‌ భాగస్వామ్యానికి తెర పడింది. 38 ఓవర్లలో కివీస్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత పాండ్య బౌలింగ్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరకు న్యూజిలాండ్... 49 ఓవర్లకు ఆలౌట్ అయ్యి...243 పరుగులు చేసింది.

రెండు జట్లు -


భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాయుడు, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, చహల్‌.

న్యూజిలాండ్‌ : విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బ్రేస్‌వెల్, సోధి, ఫెర్గూసన్, బౌల్ట్‌.

 
Loading...
Video: పంజాబ్ సింగర్‌పై నోట్ల వర్షం... బకెట్లలో కరెన్సీ నింపుకున్న నిర్వాహకులు...
First published: January 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...