ఇంత నిర్లక్ష్యమా.. టీమిండియా భారీ మూల్యానికి ఎంపైర్సే కారణం..!

ఫీల్డ్‌లో ఉన్న ఎంపైర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

news18-telugu
Updated: July 11, 2019, 9:03 AM IST
ఇంత నిర్లక్ష్యమా.. టీమిండియా భారీ మూల్యానికి ఎంపైర్సే కారణం..!
పవన్ ప్లే సమయంలో ఇన్నర్ సర్కిల్ అవతల ఆరుగురు ఫీల్డర్లను సెట్ చేసిన కివీస్..
news18-telugu
Updated: July 11, 2019, 9:03 AM IST
న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌.. అప్పటిదాకా విజృంభించిన జడేజా పెవిలియన్ చేరినా..చాలామందిలో ధోనీ క్రీజులో ఉన్నాడనే భరోసా.. మిస్టర్ కూల్ మళ్లీ మేజిక్ చేయకపోతాడా? తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ఫినిష్ చేయకపోతాడా..? అన్న ఆసక్తి. అందుకు తగ్గట్టే 48 ఓవర్ తొలి బంతిని
ధోనీ స్టాండ్స్‌లోకి పంపించడంతో అందరిలోనూ ఆశలు రెట్టింపయ్యాయి. కానీ అదే ఓవర్ మూడో బంతికి ధోనీ రనౌట్ అవడంతో కోట్ల మంది ఆశలు కుప్పకూలిపోయాయి. ఎప్పుడు కూల్‌గా ఉండే ధోనీ కూడా మైదానం వీడుతూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అదే ధోనీ ఔట్ కాకుండా ఉండి ఉంటే కచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేదేమో..! ఫీల్డ్‌లో ఉన్న ఎంపైర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ధోనీ ఔట్ అయిన బంతి కంటే ముందు.. టెలివిజన్ స్క్రీన్‌పై కివీస్ ఫీల్డింగ్ సెట్టింగ్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ చూపించారు.అందులో కివీస్ ఇన్నర్ సర్కిల్ అవతల ఆరుగురు ఫీల్డర్లను సెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది.కానీ నిబంధనల ప్రకారం పవర్ ప్లే సమయంలో కేవలం ఐదుగురు ఫీల్డర్లను మాత్రమే 30 యార్డ్ సర్కిల్‌ బయట పెట్టాలి. కానీ ఇదేది గమనించకుండా ఎంపైర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


ఒకవేళ ఎంపైర్స్ అది గమనించి 'నో బాల్' ప్రకటించినా.. ధోనీ రనౌట్ అయ్యాడు కాబట్టి ఎలాగూ పెవిలియన్ చేరేవాడే కదా అనుకుంటున్నారా..? కానీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.. ఒకవేళ ఇన్నర్ సర్కిల్ లోపల అదనంగా మరో ఫీల్డర్‌ను మోహరించి ఉంటే.. ధోనీ ఆ బంతికి డబుల్ తీయడం కాకుండా సింగిల్‌కే పరిమితమై ఉండేవాడేమో అంటున్నారు. అలా ధోనీ క్రీజులో నిలిచి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదేమో అంటున్నారు.
ఈ తప్పిదానికి ఇప్పుడెవరు బాధ్యత వహిస్తారని ఫ్యాన్స్ ఎంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది నెటిజెన్స్ న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌ను తప్పు పడుతున్నారు. ఇలా తప్పుడు పద్దతిలో మ్యాచ్ ఆడి గెలవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...