India vs New Zealand: ఏకాగ్రత లోపంతోనే అపజయం మూటగట్టుకున్నాం...కోహ్లీ ఆవేదన

Virat Kohli| ఏకాగ్రత లేకపోవడం వల్లే న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ వాపోయాడు.

news18-telugu
Updated: February 11, 2020, 10:07 PM IST
India vs New Zealand: ఏకాగ్రత లోపంతోనే అపజయం మూటగట్టుకున్నాం...కోహ్లీ ఆవేదన
కోహ్లీ...
  • Share this:
India vs New Zealand| మూడు మ్యాచుల్లో అద్భుత విజయం సాధించిన కివీస్.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. టీ-20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన వన్డే సిరీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. తమ జట్టు ఓటమికి కారణమని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఏకాగ్రత లేకపోవడం వల్లే న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ వాపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతరం స్కోర్‌ చూసిన తర్వాత తమ ఆటతీరు అంత చెత్తగా లేదని అనుకున్నామని. అయితే చిన్న చిన్న తప్పిదాలతో పాటు భారీ తప్పిదాలు సైతం జత కావడంతో మ్యాచు చేజార్చుకున్నామని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో గెలవాలంటే.. ఇలా ఆడితే కుదరదని. బౌలింగ్ విభాగంలో వైఫల్యంతో పాటు, ఫీల్డింగ్‌లోనూ రాణించలేకపోయామన్నారు. అందుకే తాము విజయానికి అర్హులం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా బ్యాట్స్‌మెన్ పోరాడిన తీరును కోహ్లీ అభినందించాడు.

ఫీల్డింగ్, బౌలింగ్ చేసిన తీరు చూస్తే.. మాకు ఏకాగ్రత లోపించిందని, న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసిందని, అయితే టెస్ట్ సిరీస్ లో మాత్రం రాణించేందుకు శాయశక్తులా పుంజుకుంటామని కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు.

First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు