IND vs NZ 2nd ODI : నేడు న్యూజిలాండ్‌‌తో టీమిండియా రెండో వన్డే... గెలిచి తీరాల్సిందే...

India vs New Zealand 2nd ODI : బౌలర్ల వైఫల్యంతో తొలి వన్డేను చేజార్చుకున్న టీమిండియా... ఇవాళ తప్పక గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రాక్టీస్ చాలా ఎక్కువగా చేసింది. గెలిస్తే... సిరీస్ సమం అవుతుంది.


Updated: February 8, 2020, 6:23 AM IST
IND vs NZ 2nd ODI : నేడు న్యూజిలాండ్‌‌తో టీమిండియా రెండో వన్డే... గెలిచి తీరాల్సిందే...
IND vs NZ
  • Share this:
India vs New Zealand 2nd ODI : టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియాకి... ఏ మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు కివీస్ వీరులు. టీమిండియా ఇచ్చిన భారీ స్కోర్ టార్గెట్‌ (348 పరుగులు)ను ఛేదించి మరీ తమను తక్కువ అంచనా వెయ్యవద్దని చెప్పకనే చెప్పారు. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది. అందువల్ల ఇవాళ జరిగే రెండో వన్డేలో టీమిండియా తప్పగ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ గెలిస్తే... 1-1తో సిరీస్ సమం అవుతుంది. తద్వారా మూడో వన్డేను కూడా గెలిచి... సిరీస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే ఇవాళ కూడా టీమిండియా ఓడిపోతే... న్యూజిలాండ్‌కి సిరీస్ దక్కుతుంది. అందువల్లే రెండు జట్లూ ఆక్లాండ్ వేదికగా జరిగే ఇవాళ్టి మ్యాచ్‌పై ఎంతో పట్టుదలతో ఉన్నాయి.

ఇదివరకు టీమిండియా.... వెస్టిండీస్‌‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడేటప్పుడు ఇలాగే దెబ్బతింది. మొదట్లో మ్యాచ్‌లు కోల్పోయి... తర్వాత మళ్లీ కోలుకొని సిరీస్‌ గెలుచుకుంది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విషయంలో ఎలాంటి టెన్షన్లూ లేవు. ఎటొచ్చీ బౌలర్లే ఫామ్ లోకి రావాల్సి ఉంది. హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో ఇష్టమొచ్చినట్లు వైడ్లు ఇచ్చేసి... కివీస్ స్కోర్ ఈజీగా పెరిగేందుకు కారణమయ్యారు భారత బౌలర్లు. నిజంగా ఏ టీమైనా 347 పరుగుల టార్గెట్ ఇస్తే... అవతలి టీమ్... ఆ టార్గెట్ చూడగానే నీరసించిపోతుంది. చాలా సందర్భాల్లో వరుసగా... వికెట్లు కూడా కోల్పోతాయి ప్రత్యర్థి జట్లు. అలాంటిది మన బౌలర్లు చేసిన తప్పిదాలతో... న్యూజిలాండ్‌కి ఈజీగా ఓ మ్యాచ్ అప్పగించడమే కాక... సిరీస్‌లో కూడా ఆధిక్యం దక్కేలా చేసి... టీమిండియా ఒత్తిడిలో చిక్కుకుంది. ఇప్పుడు టీమిండియా ముందున్న మరో సమస్య ఏంటంటే... కివీస్ గడ్డపై టీమిండియా తొలి వన్డే ఓడిన తర్వాత తిరిగి విజయాలు సాధించిన చరిత్ర లేదు. అందువల్ల కివీస్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.

లక్కేంటంటే ఇవాళ్టి పిచ్... పరుగుల పిచ్. కాబట్టి... కోహ్లీ సేన భారీగా పరుగులు సాధించడంపైనే దృష్టి పెడుతోంది. ఐతే... ఈ పిచ్‌పై రెండోసారి బ్యాటింగ్ చేసే టీమ్‌కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే... బౌలింగ్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే... ఇవాళ్టి మ్యాచ్‌లో కివీస్‌కే అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం తొలి వన్డేలో టీమిండియా ఓటమే.

టీమిండియా జట్టు అంచనా : కోహ్లీ (కెప్టెన్‌‌), పృథ్వీ, మయాంక్‌‌, మనీష్‌‌, శ్రేయస్‌‌, రాహుల్‌‌, సైనీ / ఠాకూర్‌‌, జడేజా, చాహల్‌‌ / కుల్దీప్‌‌, బుమ్రా, షమీ.

న్యూజిలాండ్‌ జట్టు అంచనా ‌: లాథమ్‌‌ (కెప్టెన్‌‌), నికోల్స్‌‌, గప్తిల్‌, టేలర్‌‌, బ్లండెల్‌‌, నీషమ్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌, శాంట్నర్‌‌, బెనెట్‌‌, సౌథీ, జెమీసన్‌‌.
First published: February 8, 2020, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading