IND vs NZ : టీమిండియాను కరుణించిన వరుణుడు... ఎందుకో తెలుసా?

India vs Newzealand : వర్షం వల్ల ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా పడినా... చివరి క్షణాల్లో జరిగిన పరిణామాలు టీమిండియాను ఒకింత టెన్షన్ పెట్టాయి. మరి ఇవాళ్టి పరిస్థితేంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 7:01 AM IST
IND vs NZ : టీమిండియాను కరుణించిన వరుణుడు... ఎందుకో తెలుసా?
మ్యాచ్‌ని వర్షం అడ్డుకుంటుందా? (Image : Twitter / Cricket World Cup)
Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 7:01 AM IST
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించడం ఇటు టీమిండియా, అటు న్యూజిలాండ్... రెండువైపులా అభిమానులను నిరాశ పరిచింది. ఐతే... ఓవరాల్‌గా చూస్తే... ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో... ఇండియన్స్ ఒకింత హ్యాపీగా ఉన్నారు. ఐతే... నిన్నటి మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించిన తరుణంలో... న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. దాంతో... వర్షం కారణంగా... డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తే ఏంటన్న ప్రశ్న తలెత్తింది. న్యూజిలాండ్ చివరి ఓవర్లలో ఎక్కువ స్కోర్ చెయ్యడంతో... డక్ వర్త్ లూయిస్ ప్రకారం... 20 ఓవర్లే మ్యాచ్ జరిగితే టీమిండియా 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. ఇది ఒకింత టెన్షన్ తెప్పించేదే. మ్యాచ్ కొనసాగించే ఉద్దేశంతో... రాత్రి (భారత కాలమానం ప్రకారం) 10 గంటల సమయంలో... పిచ్ ఎలా ఉందో పరిశీలించారు. అప్పటికీ పిచ్ ఆరలేదు. బంతి స్లిప్ అయ్యే పరిస్థితి ఉంది. అదీకాక... మరోసారి వర్షం పడింది. దాంతో మ్యాచ్‌ని రిజర్వ్ డే (ఇవాళ్టికి)కి వాయిదా వేశారు.


ఇవాళ కూడా వర్షం పడే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని భారత్‌.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడుతుంది కాబట్టి... మ్యాచ్ జరగకపోతే... టీమిండియా ఫైనల్ అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ప్రపంచకప్‌ దక్కించుకోలేకపోయిన న్యూజిలాండ్‌కు ఇది షాకింగ్ న్యూసే. ఇప్పటివరకూ చాలా సెమీ ఫైనల్స్‌లో ఆడిన న్యూజిలాండ్... గతంలో ఓసారి ఫైనల్ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఖంగు తిన్నది. దాంతో ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ వచ్చిన వరల్డ్ కప్ కివీస్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు కూడా వర్షం కారణంగా కివీస్ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...