India vs New Zealand 5th T20 : న్యూజిలాండ్ టీమ్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువే. ముఖ్యంగా ఇండియా లాంటి టీమ్‌లతో ఆడేటప్పుడు కచ్చితంగా తామే గెలుస్తామని నమ్ముతారు. పైగా... సొంతగడ్డపై ఆ టీమ్ మంచి పెర్ఫార్మెన్స్ చేసిన రికార్డ్ ఉంది. అదే సమయంలో... అదే న్యూజిలాండ్ గడ్డపై అంతగా పెర్ఫార్మెన్స్ చెయ్యని రికార్డు టీమిండియాకు ఉంది. అందువల్లే ఈ సిరీస్ ప్రారంభంలో... ఆల్రెడీ ప్రపంచకప్ గెలిచే అవకాశాలుండీ ఓటమి పొందిన న్యూజిలాండ్ టీమ్... టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని అనుకుంది. తీరా చూస్తే... వరుసగా నాలుగు టీ20ల్లో కోహ్లీ సేన దుమ్మురేపేసరికి... ఇవాళ్టి మ్యాచైనా గెలుస్తామా అన్న సందేహంలో పడిపోయింది న్యూజిలాండ్ టీమ్. ముఖ్యంగా చివరి రెండు టీ20ల్లో సూపర్ ఓవర్ విజయాల్ని టీమిండియా సొంతం చేసుకుంది. అంతలా ప్రయత్నించినా కివీస్‌కి విజయం దక్కట్లేదు. నాలుగో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా... ఓడిపోయింది ఆ టీమ్. ఈ పరిస్థితులు టీమిండియాలో కాన్ఫిడెన్స్‌ని బాగా పెంచాయి. సిరీస్ గెలవకపోయినా... కనీసం మ్యాచ్‌లు గెలిస్తే చాలనుకున్న టీమ్... ఇప్పుడు సిరీస్ ఆల్రెడీ గెలిచేయడమే కాదు... క్లీన్ స్వీ్ప్ కూడా చెయ్యాలనే పట్టుదలతో ఉంది. అటు కాన్ఫిడెన్స్ బాగా చచ్చిపోయిన కివీస్ టీమ్... చివరి మ్యాచైనా గెలిస్తే బాగుండు అని అనుకునే పరిస్థితికి వచ్చేసింది.
ఇవాళ్టి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే అదో చరిత్రే. ఎందుకంటే అది ప్రపంచ రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ టీమూ 5 టీ20ల సిరీస్‌ను క్లీన్స్వీ్ప్ చెయ్యలేదు. అందుకే కోహ్లీసేన ఎక్కడ లేని ఆసక్తితో ఇవాళ్టి మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను ఇప్పటికే తన సొంతం చేసుకున్న కోహ్లీసేన కొన్ని లైనప్ మార్పులతో బరిలో దిగాలనుకుంటోంది. అటు కివీస్ మాత్రం ఎంతకీ గెలవలేకపోతోంది. ఎలాగైనా భారత్ చరిత్ర సృష్టించకుండా చెయ్యాలని ఆశిస్తూ... ఇవాళ్టి మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. ఐతే... అందుకు అనుకూలమైన అవకాశాలు ఆ జట్టుకు కనిపించట్లేదు. చిత్రమేంటంటే... సొంత గడ్డపై టీ20ల్లో ఇంత ఘోరంగా ఆ టీమ్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి మాత్రం ఆ ఓటమి రుచి చూస్తోంది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రాబోతోంది. దానికి సన్నాహక సిరీస్‌గా ఇది నిలుస్తోంది. అందువల్ల క్లీన్ స్వీప్ చేస్తే... భారత జట్టులో కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. అందుకోసం రాహుల్, దూబేలలో ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. అలాగే చాహల్‌ను తప్పించి ఇప్పటివరకూ ఆడని స్పిన్నర్ కుల్దీప్ను తెచ్చే అవకాశం ఉంది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో పక్కకు తప్పుకుంటే... రోహిత్ ఎంటరై మ్యాచ్ నడిపించే చాన్స్ ఉంది. ఇలా ఇవాళ్టి మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మధ్యాహ్నం 12.30కి మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో రానుంది.