వన్డే సిరీస్‌లో అమ్మాయిల మ్యాచ్ తర్వాత అబ్బాయి మ్యాచ్ మొదలయ్యేది. పొట్టి ఫార్మాట్లో మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు ఆడుతున్నారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన తొలిటీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఇండియన్ స్టార్ ప్లేయర్, ఓపెనర్ స్మృతి మంధానా అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగినా... వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ లేకపోవడం జట్టు ఓటమికి కారణమైంది. రోహిత్ సేనలాగే టాస్ గెలిచిన టీమిండియా... న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన కివీస్ వుమెన్స్ టీమ్... 159 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 62 పరుగులు, కివీస్ కెప్టెన్ సట్టెర్‌వైట్ 33 పరుగులు, కేజే మార్టిన్ 27 పరుగులు చేశారు.
భారత బౌలర్లు అరుంధతి రెడ్డి, రాధ, దీప్తి శర్మ, పూనమ్లక తలా ఓ వికెట్ దక్కాయి. ఆ తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు... మొదటి ఓవర్లోనే ఓపెనర్ ప్రియ వికెట్ కోల్పోయింది. స్టార్ ప్లేయర్ స్మృతి మంధానా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసింది. ఆమెకు మరో యంగ్ సెన్సేషన్ జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి సహకారం అంించింది. రోడ్రిగ్స్ 38 పరుగులు చేసి అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన భారత జట్టు... 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హేమలత 3, అరుంధతి 2 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 పరుగులు చేసింది. దీప్తి శర్మ 5, తానియా భాటియా ఒక్క పుగు చేయగా, పూనమ్ 3 పరుగులు, అనూజ డకౌట్ అయ్యింది. 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయిన భారత్... 23 పరుగులతో పరాజయం మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్‌లో మాదిరిగానే భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ లేకపోవడమే భారత ఓటమికి కారణమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండడం విశేషం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.