• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS NEW ZEALAND LIVE SCORE ICC WOMENS T20 WORLD CUP 2020 INDIA QUALIFY FOR SEMIFINAL SK

Women’s T20 World Cup: ఉత్కంఠ పోరులో గెలుపు.. సెమీస్‌కు భారత్

టీమిండియా విజయోత్సాహం

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్ట.. విజయానికి 4 రన్స్ దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టును గెలిపించారు.

  • Share this:
    మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టారు. మెల్‌బోర్న్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన 4 పరుగుల తేడాతో కివీస్ జట్టుపై గెలిచింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. విజయానికి 4 రన్స్ దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టును గెలిపించారు.

    మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. షఫాలి వర్మ 46, తానియా భాటియా 23 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌ఉమెన్ పెద్దగా స్కోర్ చేయనప్పటికీ భారత్ గౌరవప్రదమైన స్కోర్ మాత్రం చేయగలిగింది. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్, రోస్‌మేరి మెయిర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లీ తాహుహు, సోఫీ డివైన్, కాస్పెరెక్ తలో వికెట్ సాధించారు.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కివీస్ జట్టు ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్ ఉమెన్ రాణించడంతో స్కోరు పెరిగింది. అమేలియా కెర్ 34, కేటీ మార్టిన్ 25, మాడీ గ్రీన్ 24 పరుగులతో రాణించారు. ఐతే చివర్లలో భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published: