INDIA VS NEW ZEALAND LIVE CRICKET SCORE 1ST T20I AT WELLINGTON ROHIT TEAM LOSSES THEIR FIRST MATCH WITH HUGE DIFFERENCE CR
Ind vs NZ 1st T20I: మళ్లీ అదే తడ‘బ్యాటు’... మొదటి టీ20లో భారత్ ఘోర పరాజయం... రికార్డు తేడాతో
రిషబ్ పంత్ (PHOTO: twitter)
ఘోరంగా విఫలమైన భారత బ్యాట్స్‌మెన్... కొనసాగుతున్న రోహిత్ శర్మ ఫ్లాప్ షో... 80 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో వెనకబడిన టీమిండియా...
వన్డే సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్ కూడా పట్టేదామని చూసిన రోహిత్ సేనకు గట్టి షాక్ ఇచ్చింది న్యూజిలాండ్ టీమ్. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బౌలర్లు కూడా విజృంభించడంతో టీమిండియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేదు. విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి, వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన రోహిత్ శర్మ... మూడో ఓవర్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఐదు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు రోహిత్. ఆ తర్వాత శిఖర్ ధావన్ 29 పరుగులు, విజయ్ శంకర్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వికెట్ కీపర్లు రిషబ్ పంత్ 4 పరుగులు, దినేశ్ కార్తీక్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధోనీ, కృనాల్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కొండంత లక్ష్యం కారణంగా రన్‌రేట్ పెరుగుతూ పోయింది. ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించిన తర్వాత 20 పరుగులు చేసిన కృనాల్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి అవుట్ అవ్వగా... 30 బంతుల్లో 5 ఫోర్లు, ఒక్క సిక్సర్‌తో 39 పరుగులు చేసిన ధోనీ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికే లక్ష్యం చివరి ఓవర్లో 84 పరుగులు.
మహేంద్రసింగ్ ధోనీ
2010 టీ20 వరల్డ్‌కప్‌లో 49 పరుగులతో ఓడింది టీమిండియా. ఇప్పటిదాకా భారతజట్టుకు అదే అతి పెద్ద ఓటమి. ఈ మ్యాచ్ ద్వారా అంతకంటే భారీ ఓటమిని మూటగట్టుకుంది రోహిత్ టీమ్...
చివరి ఓవర్ రెండో బంతికే చాహాల్ అవుట్ కావడంతో 139 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. అంతకుముందు టాస్ గెలిచి, ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్‌కు షాక్ ఇచ్చేలా... కివీస్ ఓపెనర్లు చెలరేగిపోయారు. రెండో ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌తో మున్రో కూడా వేగంగా పరుగులు సాధించడంతో 8.2 ఓవర్లలోనే 86 పరుగులు దాటింది. ఈ దిశలో మున్రోను అవుట్ చేసిన క్రునాల్ పాండ్యాకు టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్‌తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు.
భారత బౌలర్లు
దినేశ్ కార్తీక్ ఓ సులువైన క్యాచ్ జారవిడచడంతో బతికిపోయిన సిఫర్ట్... 42 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత బౌండరీ దగ్గర అద్భుత క్యాచ్‌తో మిచెల్‌ను అవుట్ చేశాడు దినేశ్ కార్తీక్. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ 22 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత రాస్ టేలర్ బౌండరీలతో చెలరేగాడు.
2016లో వెస్టిండీస్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా 200+ స్కోరు సాధించడం ఇదే ప్రథమం.
రాస్ టేలర్ చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ దగ్గర కార్తీక్ జారవిడిచాడు. గ్రాండ్‌హోమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లో రాస్ టేలర్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్కా్ట్ 7 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసి... భారీ స్కోరుకి బాటలు వేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కివీస్...219 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కగా, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, కునాల్ పాండ్యా, చాహాల్‌లకు చెరో వికెట్ దక్కాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.