హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvsNZ: నేడే ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలక మ్యాచ్.. ఓడిన జట్టుకు సెమీస్ అవకాశాలు గల్లంతే.. ఇవీ తుది జట్లు

INDvsNZ: నేడే ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలక మ్యాచ్.. ఓడిన జట్టుకు సెమీస్ అవకాశాలు గల్లంతే.. ఇవీ తుది జట్లు

నేడు ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలక మ్యాచ్ (PC: Twitter)

నేడు ఇండియా - న్యూజీలాండ్ మధ్య కీలక మ్యాచ్ (PC: Twitter)

ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) నేడు ఇండియా (India) - న్యూజీలాండ్ (New Zealand) జట్ల మధ్య కీలక పోరు జరుగనున్నది. గ్రూప్ 2లో ఇప్పటికే పాకిస్తాన్ (Pakistan) జట్టు సెమీ ఫైనల్‌కు దాదాపు అర్హత సాధించగా.. మిగిలిన బెర్త్ కోసం ఇండియా, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్ (Afghanistan) పోరాడుతున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో కివీస్ జట్టు పూర్తిగా తడబడింది. కివీస్ జట్టు బ్యాటింగ్ డెప్త్ వారిని కలవరపెడుతున్నది. ఓపెనర్లు గుప్తిల్-మిచెల్‌లు తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. అయితే తనదైన రోజున మార్టిన్ గుప్తిల్ భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. అతడిని త్వరగా అవుట్ చేయలేకపోతే భారత భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్‌సన్ ఫామ్‌లోకి వస్తే భారీ స్కోర్లు సాధించే సత్తా ఉంటుంది. కివీస్ జట్టు బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉన్నది. అయితే కీలకమైన లాకీ ఫెర్గూసన్ టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి స్థానంలో అడమ్ మిల్నే వచ్చాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్‌కు తోడుగా మిల్నే రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు.

ఇక కివీస్ స్పిన్నర్లు ఇష్ సోథి, జేమ్స్ నీషమ్ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. నీషమ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి భారత జట్టు టాప్ 5 బ్యాటర్లపైనే కాకుండా ఆ తర్వాత బ్యాటుతో రాణించే వారిపై కూడా భారత జట్టు కన్నేసి ఉంచాలి. కివీస్ బ్యాటింగ్ లైనప్ గతంతో పోలిస్తే పెద్దగా బలంగా లేదు. కానీ భారత బౌలర్లు పాకిస్తాన్‌పై కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోవడం కలవర పెడుతున్నది. భారత జట్టు జస్ప్రిత్ బుమ్రాపై ఎక్కువగా ఆధారపడుతున్నది. భువనేశ్వర్ కుమార్ ఇటీవల పెద్దగా రాణించడం లేదు. కాబట్టి అతడిని పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం అవుతాడని తెలుస్తున్నది. బౌలింగ్ విభాగంలో కేవలం ఒక మార్పు మాత్రమే ఉండవచ్చు. భువీ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వవొచ్చు. పాకిస్తాన్ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తమ వికెట్లను చాలా తేలికగా పారేసుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన వాళ్లు పాక్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ పూర్తిగా విఫలమయ్యారు.


ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ అలా విఫలం అవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంచనాల మేరకు రాణించలేదు. భారత జట్టులో ఓపెనర్ల నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు అందరూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న వాళ్లే. కానీ పాక్‌పై మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. ముఖ్యంగా మంచి మ్యాచ్ ఫినిషర్ అనిపించుకున్న హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. అయినా టీమ్ మేనేజ్‌మెంట్ అతడిపై పూర్తి నమ్మకం ఉంచుతున్నది. కివీస్‌తో మ్యాచ్‌లో కూడా పాండ్యా ఉంటాడని కోహ్లీ చెప్పాడు. ఇక శార్దుల్ ఠాకూర్‌ను తీసుకుంటే అతడికి కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నది. దీంతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత లోతుగా ఉండబోతున్నది. తమదైన రోజున భారత టాపార్డరే పూర్తి కోటా ఆడిన రోజులు ఉన్నాయి. కాబట్టి కివీస్‌తో భారత జట్టు బ్యాటింగ్ కుదురుకోవల్సిన అవసరం ఉన్నది.

Eng Vs Aus : ఇంగ్లండ్ ముందు పసికూనలా మారిన ఆస్ట్రేలియా.. కేవలం 70 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్...ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు కివీస్‌పై గత 21 ఏళ్లలో కేవలం ఒక సారి మాత్రమే గెలిచింది. 18 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా ఇండియా గెలవలేదు. కానీ.. గత ఐదు టీ20 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాదే పై చేయి కావడం కలసి వచ్చే అంశం. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు 66 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగగా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 34 సార్లు.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 31 సార్లు గెలిచింది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 143 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోర్ 123 మాత్రమే. ఇక్కడ టాస్ కీలకం కాబోతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది.

తుది జట్ల అంచనా:

ఇండియా :రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా,. వరుణ్ చక్రవర్తి

న్యూజీలాండ్ : మార్టిన్ గుప్తిల్, టిమ్ సిఫర్ట్, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, డెరిల్ మిచెల్, టిమ్ సౌథీ, ఇష్ సోథి, ట్రెంట్ బౌల్ట్

First published:

Tags: India vs newzealand, T20 World Cup 2021

ఉత్తమ కథలు