India vs New Zealand 1st Test : న్యూజిలాండ్... వెల్లింగ్టన్లో జరిగిన తొలి టెస్టులో... టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్... 10 వికెట్ల తేడాతో ఓపెనింగ్ టెస్ట్ గెలిచి... రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇంతకుముందు మూడు వన్డేల సిరీస్‌లో కూడా టీమిండియా ఇలాగే ఏమాత్రం పైచేయి సాధించలేకపోయింది. ప్రధానంగా కివీస్ గడ్డపై ఈ మ్యాచ్‌లు జరుగుతుండటం... దానికి తోడు... కివీస్‌లో పేసర్లు ఫామ్‌లోకి రావడంతో... న్యూజిలాండ్ టైమ్ బాగుంది. అందువల్లే ఏకంగా 10 వికెట్ల తేడాతో కోహ్లీ సేన పరాజయం పాలైంది. టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత... సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆట నాలుగో రోజు... ఎంతో ఈజీగా కివీస్... విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు టామ్ బ్లండెల్, టామ్ లాథమ్... మొదటి రెండు ఓవర్లలోనే 9 రన్స్ తీసి... ఈజీగా ఆట ముగించేశారు.
అంతకుముందు మూడోరోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్సులో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో రహానే(25), విహారీ(15) ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్‌కి మూడు వికెట్లు, సౌథీకి వికెట్ దక్కింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందువల్ల రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మరో 39 పరుగులు వెనకంజలో ఉంది. నాలుగో రోజు ఆట మొదలవ్వగానే... రహానే, విహారీ... ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్... రెండు ఓవర్లలోనే కావాల్సిన 9రన్స్ తీసి... అద్భుత విజయాన్ని అందుకుంది.
ఇది న్యూజిలాండ్‌కి 100 టెస్ట్ విజయం. అంతే కాదు... కివీస్ ప్లేయర్ రాస్ టేలర్‌కి కూడా ఇది 100 టెస్టే. ఇక ఇండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇది తొలి ఓటమి. రెండో టెస్టు... క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం మొదలవుతుంది.
Published by:Krishna Kumar N
First published:February 24, 2020, 07:53 IST