IND vs NZ : నేడు రెండో టీ20... న్యూజిలాండ్‌కి షాకివ్వాలనుకుంటున్న టీమిండియా

India vs NewZealand 2nd T20 : తొలి మ్యాచ్‌లో సాధించిన విజయంతో టీమిండియా పట్టుదలగా ఉంటే... ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ ఎదురుచూస్తోంది.

news18-telugu
Updated: January 26, 2020, 6:27 AM IST
IND vs NZ : నేడు రెండో టీ20... న్యూజిలాండ్‌కి షాకివ్వాలనుకుంటున్న టీమిండియా
IND vs NZ : నేడు రెండో టీ20... న్యూజిలాండ్‌కి షాకివ్వాలనుకుంటున్న టీమిండియా
  • Share this:
India vs NewZealand 2nd T20 : టీమిండియాలో కాన్ఫిడెన్స్ కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. తొలి 20ని మరో ఓవర్ ఉండగానే ముగించేయడం అందులో భాగమే. ఐతే... ఐదు టీ20ల సిరీస్‍‌లో మొదటి మ్యాచ్ సక్సెస్ అయినా... మరో నాలుగు ఉన్నాయి. వాటిలో ఇవాళ మొదలయ్యే రెండో మ్యాచ్ కూడా కీలకమైనదే. ఇందులో కూడా కచ్చితంగా గెలిస్తేనే టీమిండియాకి టెన్షన్ కాస్త తగ్గుతుంది. అందుకే కోహ్లీ సేన ఇవాళ్టి మ్యాచ్‌కి గెలిచేసి... రిపబ్లిక్ డే నాడు భారత్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటోంది. ఆక్లాండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే... టీమిండియా 2-0 ఆధిక్యానికి చేరుతుంది. తద్వారా కివీస్‌కి టెన్షన్ పీక్ స్టేజ్‌కి చేరుతుంది. ఆ తర్వాతి మూడు మ్యాచుల్లో భారత్ ఒక్కటి గెలిచినా చాలు... సిరీస్ మనదే అవుతుంది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ మనకు కీలకంగా మారింది. కివీస్ లెక్కలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్ గెలిచేసి... సిరీస్ సమం చెయ్యాలని చూస్తోంది. అదే జరిగితే... తర్వాతి మూడు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా రెండు గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. అది టీమిండియాకు సవాలే అవుతుంది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది.

ఈసారి మ్యాచ్‌ కోసం జట్టులో చిన్న మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. ఐతే తొలి మ్యాచ్‌లో రాహుల్‌, కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ చక్కగా రాణించారు. ఇక రోహిత్ కూడా దుమ్మురేపితే... టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఐతే... మొదటి మ్యాచ్‌లో బౌలర్లు సరిగా రాణించలేదని భావిస్తున్న కోహ్లీ... పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో సైనీని తీసుకోవచ్చని తెలుస్తోంది. లక్కేంటంటే... కివీస్ టీంలో కీలక బౌలర్లు లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఏది ఏమైనా... సొంతగడ్డపై ఆ టీంకి గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటున్నాయి. పైగా ఇంటర్నేషనల్‌ టీ20ల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు ఎప్పుడూ గెలవలేదు. అందువల్ల ఇవాళ్టి మ్యాచ్ విషయంలో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం కనిపిస్తోంది.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు