INDIA VS NEW ZEALAND INDIA LOOK TO END KIWI TOUR WITH HISTORIC SERIES VICTORY CR
Ind vs NZ: బిగ్ ఫైనల్ ఫైట్... గెలిస్తే సిరీస్... రోహిత్ సేన కోసం రికార్డులు వెయిటింగ్...
వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా
గత 10 సిరీస్‌ల్లో 8 సిరీస్‌లు గెలిచిన టీమిండియా... మూడో మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే కసిలో టీమిండియా... ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న కివీస్...
న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ను వరుస విజయాలతో పట్టేసిన టీమిండియా... టీ20ల్లో మాత్రం ఆరంభంలోనూ ఊహించని షాక్ తగిలింది. రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసిన టీమిండియా... కివీస్ గడ్డ మీద మొట్టమొదటి టీ0 సిరీస్ గెలవాలనే కసితో ఉంది. హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12:30 ని.లకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి... న్యూజిలాండ్ టూర్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది రోహిత్ టీమ్. ఇప్పటిదాకా కివీస్‌తో భారత్ టీ20 సిరీస్ గెలిచింది లేదు. మొత్తంగా 9 సార్లు ఇరుజట్లు పోటీ పడగా... ఏడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. రెండో టీ20 మ్యాచ్‌తో కలిపి రెండు సార్లు మాత్రమే టీమిండియాకు సక్సెస్ సొంతమైంది.
హామిల్టన్ టీ20లో గెలిచి కివీస్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తోంది రోహిత్ టీమ్. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి... వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విలయంసన్ టీమ్ ఆలోచిస్తోంది. రెండో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం... టీమిండియాకు కలిసొచ్చే అంశం. అతనితో పాటు శిఖర్ ధావన్, రిషబ్ పంత్ కూడా మంచి టచ్‌లో కనిపించారు. కొత్త కుర్రాడు విజయ్ శంకర్ కూడా ప్రారంభంలో పరుగులు చేస్తున్నా... వాటిని బిగ్ స్కోర్‌గా మలచడంలో మాత్రం విఫలమవుతున్నాడు. మూడో మ్యాచ్‌లో అతని స్థానంలో యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌కు స్థానం లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రెండో మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో మెరిశాడు కాబట్టి అతని స్థానానికి ఢోకా లేనట్టే. రెండో టీ20లోనే రోహిత్ శర్మ జట్టులో మార్పులు చేస్తాడని అందరూ భావించినా... ఫస్ట్ మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలో దిగి విజయం సాధించాడు. దాంతో మూడో మ్యాచ్‌లో కూడా మార్పులు చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే... వరుసగా పరాజయం లేకుండా 11 సిరీస్‌లు ముగించిన జట్టుగా పాకిస్థాన్ సరసన నిలుస్తుంది. గత 10 సిరీస్‌ల్లో 8 సిరీస్‌లు సొంతం చేసుకోగా... ఆస్ట్రేలియాతో ఆడిన రెండు సిరీస్‌లను డ్రా చేసుకుంది.
ఈ మ్యాచ్ గెలిస్తే... వరుసగా 9 సిరీస్‌లు గెలిచిన జట్టుగానూ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది టీమిండియా. భారత్ చివరిసారిగా 2017 జూలైలో వెస్టిండీస్‌తో సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత మ్యాచ్‌లు పోయినా సిరీస్ మాత్రం గెలుస్తూ వచ్చింది. ఈ మ్యాచ్ గెలిస్తే అది కంటిన్యూ అవుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.