Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    IND vs NZ : ఇండియా... న్యూజిలాండ్ మధ్య నేడు తొలి టీ20

    స్వదేశంలో ఇరగదీసిన టీమిండియా... అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. మధ్యాహ్నం 12.20కి తొలి మ్యాచ్ మొదలవ్వనుంది.

    news18-telugu
    Updated: January 24, 2020, 6:42 AM IST
    IND vs NZ : ఇండియా... న్యూజిలాండ్ మధ్య నేడు తొలి టీ20
    ఫైల్ ఫొటో
    • Share this:
    మన దేశంలో సిరీస్‌లు గెలవడం టీమిండియాకి ఈజీయే. అదే విదేశీ గడ్డపై గెలవాలంటే... ఆపసోపాలు పడుతున్నారు. ఇటీవల కోహ్లీ సేన విదేశాల్లోనూ కాస్త మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. ఐతే... సమస్యల్లా న్యూజిలాండ్‌తోనే. ఆ జట్టు తమ సొంత గడ్డపై ఎప్పుడూ చెలరేగిపోతూ ఉంటుంది. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే... చుక్కలు చూపిస్తుంది. అలాంటి కివీస్‌ను అదే దేశంలో ఓడించేందుకూ... ఐదు టీ20ల సిరీస్ కొట్టేందుకు కోహ్లీసేన అక్కడ అడుగుపెట్టింది. భారత జట్టుకు ఎదురయ్యే అసలైన పరీక్ష అక్కడి పిచ్‌లే. పేస్, స్వింగ్, బౌన్స్ వంటివి... బ్యాట్స్‌మెన్‌ జోరుకు బ్రేక్ వేయగలవు. ఐతే... త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఆ కప్పు కొట్టాలంటే... ఈ సిరీస్‌ గెలిచి... కాన్ఫిడెన్స్ పెంచుకోవాల్సిన అవసర ఉంది. అందువల్ల టీమిండియా... ఎలాగైనా సాధిస్తామంటోంది. తొలి మ్యాచ్‌... ఈడెన్‌ పార్క్‌‌లో జరగనుంది. ప్రస్తుతానికి టీమిండియా యువ ఆటగాళ్లతో బలంగా ఉంది. దానికి తోడు... కివీస్‌పై భారత్‌ ఇవాళ్టి ఈడెన్‌ పార్క్‌లోనే ఇదివరకు ఏకైక టీ20 గెలిచింది. అదే సమయంలో... న్యూజిలాండ్ జట్టు ఫామ్‌లో లేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కివీస్ వైట్ వాష్ అయ్యింది. అయినప్పటికీ... సొంత గడ్డ కాబట్టి... తాజా సిరీస్‌పై వాళ్లలో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు టీ20ల విషయంలో... కివీస్ ఈమధ్య మంచి ట్రాక్ రికార్డ్ సాధించింది. దానికి తోడు... టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ... న్యూజిలాండ్‌లో టీ20 మ్యాచ్‌ ఆడడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా కివీస్‌తో 11 మ్యాచ్‌లు జరిగితే ఇండియా... మూడే గెలిచింది. అందువల్ల సిరీస్ గెలుపు అవకాశాలు అంత తేలికగా ఉండవని అనుకోవచ్చు. ఇవాళ్టి మ్యాచ్‌కి వర్షం పడదని చెబుతున్నారు. గాలి మాత్రం బాగానే వీస్తుందట.

    ఇండియా జట్టు అంచనా : కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, కుల్దీప్‌, మహ్మద్‌ షమి, మనీశ్‌ పాండే, జడేజా, సైనీ/ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా.

    న్యూజిలాండ్ జట్టు అంచనా : కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్టి ల్‌, మన్రో, డిగ్రాండ్‌ హోమ్‌, సీఫెర్ట్‌, రాస్‌ టేలర్‌, డారిల్‌ మిచెల్‌, కుగ్లెయిన్‌, సౌతీ, సోధీ.


    Published by: Krishna Kumar N
    First published: January 24, 2020, 6:42 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading