India vs New Zealand: రేపటి నుంచి కివీస్‌తో టీ20 సమరం...బోణీ కొట్టేదెవరు...

2019 జనవరిలో జరిగిన ‎ పర్యటనలో టీమిండియా సిరీస్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా రికార్డు దారుణంగా మారింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై భారత్ 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది.

news18-telugu
Updated: January 23, 2020, 9:00 PM IST
India vs New Zealand: రేపటి నుంచి కివీస్‌తో టీ20 సమరం...బోణీ కొట్టేదెవరు...
(Image: BCCI)
  • Share this:
వరల్డ్ కప్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా న్యూజిలాండ్‌ టూర్ ప్రారంభం కానుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ టూర్ ఫిబ్రవరి 2 వరకు సాగనుంది. ఇందులో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే టీ20ల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా రికార్డు సరిగ్గాలేదు. న్యూజిలాండ్‌లో ఆడిన ఐదు టీ20ల్లో భారత్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. 2019 జనవరిలో జరిగిన ‎ పర్యటనలో టీమిండియా సిరీస్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా రికార్డు దారుణంగా మారింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై భారత్ 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది. మిగితా మ్యాచుల్లో ఓటమి పాలైంది. అయితే 2017లో భారత్ లో పర్యటించిన కివీస్ జట్టుపై రెండు మ్యాచ్‌లలో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ ల్లో ఈ ఒక్క సిరీస్ మాత్రమే భారత్ గెలిచింది.

టీమిండియా జట్టు: విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ (విసి), సంజు సామ్సన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), శివం దుబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా షమీ, నవదీప్ సైని, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మార్టిన్ గుప్టిల్, స్కాట్ కుగ్గెలీజ్న్, డారిల్ మిచెల్, కోలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయిర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌతీ.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు