India vs New Zealand: రేపే భారత్, న్యూజిలాండ్ తొలివన్డే...గాయంతో రోహిత్ ఔట్...

న్యూజిలాండ్‌ తో వన్డే సిరీస్ రేపటి (ఫిబ్రవరి 5)నుంచి మొదలవుతుంది. హామిల్టన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: February 4, 2020, 10:41 PM IST
India vs New Zealand: రేపే భారత్, న్యూజిలాండ్ తొలివన్డే...గాయంతో రోహిత్ ఔట్...
రేపే తొలి వన్డే (Image: BCCI)
  • Share this:
న్యూజిలాండ్‌ పర్యటనలో టీం ఇండియా టీ 20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి కివీస్ పర్యటనకు శుభారంభం పలికింది. ఇక న్యూజిలాండ్‌ తో వన్డే సిరీస్ రేపటి (ఫిబ్రవరి 5)నుంచి మొదలవుతుంది. హామిల్టన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది. భారత కాలమాన ప్రకారం వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలకి ప్రారంభం అవుతాయి. ఇక వన్డే సిరీస్ అనంతరం టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది.

మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కి జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. గాయం కారణంగా రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తప్పుకోవడంతో యువ బ్యాట్స్‌మెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఇక మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషాకి జట్టులో చోటును కల్పించారు.

జట్లు ఇవే...
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, KL రాహుల్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, చహాల్, మహమ్మద్ షామీ, బుమ్రా, ఠాకూర్, నవదీప్ సైని.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్ మరియు డబ్ల్యుకె), మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జిమ్మీ నీషామ్, స్కాట్ కుగ్గెలీజ్న్, టామ్ బ్లుండెల్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, హమీష్ బెన్నెట్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, కైల్ జామిసన్, మార్క్ చాప్మన్ .
First published: February 4, 2020, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading